- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జూబ్లీహిల్స్‌లో దుబ్బాక బైపోల్ సీన్ రిపీట్.. కేసీఆర్‌పై సొంత పార్టీ విమర్శలు
భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జూబ్లీహిల్స్ఉప ఎన్నిక ప్రచారానికి దూరంగా ఉన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జూబ్లీహిల్స్ఉప ఎన్నిక ప్రచారానికి దూరంగా ఉన్నారు. పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా మారిన జూబ్లీహిల్స్ఉప ఎన్నికకు పార్టీ ముఖ్య నాయకులందరు తిష్ఠవేసి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఒక నియోజకవర్గానికి, రెండు మూడు లక్షల ఓట్లకు ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు ఈ ఎన్నికను ఎలాగైనా గెలుచుకోవాలనే ఉద్దేశంతో రెండు, మూడు వేల ఓట్లకు ఒకరు ఇంఛార్జిగా పనిచేస్తున్నారు. తమ స్థాయి తగ్గించుకోని అయినా పార్టీ ఇక్కడ గెలిస్తే భవిష్యత్‌కు భరోసా ఉంటుంది. రాబోయే రోజుల్లో జరిగే ఎన్నికలకు ఉత్సాహం నింపుతుందనే ఉద్దేశంతో కష్టపడి పనిచేస్తున్నారు. కానీ, పార్టీ అధినేత కేసీఆర్ప్రచారానికి రాకపోవడంతో వారు నిరుత్సాహానికి గురయ్యారు. తాము ఎంత చెప్పినా కేసీఆర్నోటి నుంచి వచ్చే మాటలు వేరని, ఇప్పటీకి ఆయనే ప్రధాన ప్రతిపక్ష నేతగా, పార్టీ అధ్యక్షుడిగా, మాజీ సీఎంగా ఉన్న ఆయనను ప్రజలు సీరియస్‌గా తీసుకుంటారని, పార్టీ వర్కింగ్‌ప్రెసిడెంట్, ఇతరులు ఎంత చెప్పినా అంత సీరియస్‌గా ఓటర్లు చూడరని విశ్లేషిస్తున్నారు. ప్రత్యర్థులు హోరాహోరి ప్రచారం చేస్తున్నారని గుర్తు చేస్తున్నారు.
మాగంటి గోపినాథ్సిట్టింగ్ఎమ్మెల్యేగా ఉండి చనిపోయారు. అసెంబ్లీ ప్రారంభం రోజున సిట్టింగ్సభ్యుడిగా సంతాపం తీర్మానం అనంతరం సభను వాయిదా వేస్తారు. మరే ఇతర ఎజెండాను చేపట్టరు. కాగా గత అసెంబ్లీ సమావేశాల్లో తమ పార్టీకి చెందిన మాగంటికి సంతాపం ఉంటుందని తెలిసి కూడా కేసీఆర్ఆ సమావేశాలకు హాజరుకాలేదు. అసెంబ్లీలో జరిగే సొంత పార్టీ ఎమ్మెల్యే సంతాప సభకు కూడా కేసీఆర్హాజరు కారా అంటూ విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రతిపక్ష నేతగా ఉండి ఎందుకు, ఆ పదవిని వేరే ఎవరికైనా ఇవ్వొచ్చు కదా అంటూ ప్రశ్నించారు. సొంత పార్టీ ఎమ్మెల్యేకే ఈ విధంగా వ్యవహరిస్తే ఎలా అంటూ అభ్యంతరం వ్యక్తమైంది. దీనిపై సర్దిచెప్పలేక పార్టీ ముఖ్యనేతలు కూడా ఇరకాటంలో పడ్డారు. సొంత పార్టీ ఎమ్మెల్యే చనిపోతే జరుగుతున్న ఉప ఎన్నికకు ఒక్క రోజు కూడా ప్రచారానికి రాకపోవడం దేనికి సంకేతాలు ఇస్తున్నారనే విమర్శలు సొంత పార్టీ నుంచే వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ ఆరోగ్యంపై రకరకాల ప్రచారాలు సోషల్‌మీడియాలో జరుగుతున్న సందర్భంలో ఆయన ప్రచారానికి రాకపోవడంతో వాటికి మరింత బలం చేకూర్చినట్లుగా అవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
బీఆర్ఎస్పార్టీ అధికారంలో ఉన్న సమయంలో దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారానికి కూడా కేసీఆర్దూరంగా ఉన్నారు. అక్కడ ప్రచారం చేయలేదు. ఒక్క హారీశ్రావే ప్రచార బాధ్యతలు నిర్వర్తించారు. అక్కడ అతి తక్కువ మెజార్టీతో పార్టీ అభ్యర్థి ఓడిపోయాడు. కేసీఆర్ప్రచారానికి వచ్చి ఉండి ఉంటే బీఆర్ఎస్సులువుగా గెలిచేదని గుర్తు చేస్తున్నారు. ఆనాడు అతి విశ్వాసంతోనే ప్రచారానికి రాలేదని ఓ ప్రచారం జరిగింది. ప్రత్యర్థులు మాత్రం రఘనందన్‌రావును గెలిపించడానికే కేసీఆర్ ప్రచారానికిరాలేదంటూ తీవ్రస్థాయిలో వ్యతిరేకంగా ప్రచారం చేశారు. దుబ్బాక తర్వాత రెండో ఉప ఎన్నిక జూబ్లీహిల్స్ప్రచారానికి కేసీఆర్దూరంగా ఉన్నారు. జూబ్లీహిల్స్‌లో పార్టీ గెలిస్తే ఒకే కానీ తక్కువ మెజార్టీతో ఓడిపోతే మాత్రం కేసీఆర్‌పై మరింత తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే ఫాం హౌస్‌కు పరిమితమయ్యారని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రజలకు, పార్టీ నాయకులకు అందుబాటులో ఉండరా అంటూ ప్రశ్నిస్తున్నారు. పదవి ఉంటేనే ప్రజల్లో ఉంటారా అంటూ విమర్శలు చేస్తున్నారు.
అయితే పార్టీలోని కొందరు మాత్రం మరో కోణంలో తమదైన విశ్లేషణను అందిస్తున్నారు. ఇక్కడ మొత్తం బాధ్యతలను పార్టీ వర్కింగ్ప్రెసిడెంట్కేటీఆర్ చూస్తున్నారని, గెలిస్తే ఆయన నాయకత్వానికి ప్రజల ఆమోదం వచ్చిందని చెప్పుకోవచ్చని, భవిష్యత్‌లో అంతా తానై నడిపించవచ్చని, కేసీఆర్రాకపోయినా కేటీఆర్ అంతా చూస్తారని, ఆయనే ఇక భవిష్యత్నాయకుడని, ప్రజలు కూడా ఆమోదముద్ర వేశారని చెప్పుకోవచ్చనే అంచనాలో ఉన్నారు. కేసీఆర్ రాకపోవడంతో ఓడిపోయిందని, ఆయన నాయకత్వం ఉంటేనే పార్టీకి భవిష్యత్అని చెప్పుకోవచ్చని విశ్లేషిస్తున్నారు. అయితే కేసీఆర్ప్రచారానికి వచ్చి కూడా ఓడిపోతే ఆయనకు మచ్చపడుతుందని, కేసీఆర్వచ్చినా ప్రజలు స్పందించలేదు, ఆయన నాయకత్వానికి కాలం చెల్లిందనే అనే అపవాదు పార్టీ భవిష్యత్‌పై పడుతుందని విశ్లేషిస్తున్నారు.






