Kadiam: జాతిపిత అనిచెప్పుకోవడానికి కేసీఆర్‍కు సిగ్గుండాలి: కడియం

by Prasad Jukanti |

తెలంగాణ మీ అయ్యా సొత్తా? అంటూ కేసీఆర్‍పై కడియం ఘాటు వ్యాఖ్యలతో రెచ్చిపోయారు.సెంటిమెంట్ ప్లే చేస్తున్నారని విమర్శించారు.

Kadiam: జాతిపిత అనిచెప్పుకోవడానికి కేసీఆర్‍కు సిగ్గుండాలి: కడియం
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‍పై ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్‍ను (KCR) జాతిపిత అని చెప్పుకోవడానికి సిగ్గుండాలన్నారు. ఏం చేశారని జాతిపిత అని చెప్పుకుంటున్నారని అగ్రహం వ్యక్తం చేశారు. జాతిపిత ఒక్కరే ఉన్నారని ఆయనే మహాత్మాగాంధీ అని తెలంగాణకు కేసీఆర్ ఎలా జాతిపిత అయ్యాడని ప్రశ్నించారు. జాతిపిత ప్రజల్లోకి వచ్చి సమస్యలపై ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. అధికారం కుటుంబ హక్కుగా బీఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారని కల్వకుంట్ల కుటుంబంలో అందరూ కేసుల్లో ఉన్నారని వారిపై కేసులు పెడితే తెలంగాణను అవమానించినట్టా? తెలంగాణ మీ అయ్యా సొత్తా? అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఆస్తులు బయటపెట్టండి:

అధికారం పోయినా అహంకారం, మాట తీరులో మార్పు రాలేదన్నారు. అందుకే ప్రజలు మీకు ఓటు వేయలేదని విమర్శించారు. కేసీఆర్ కూలిపోయే కాళేశ్వరం క్టటుడమే కాకుండా రాష్ట్రాన్ని దివాలా తీశారని విమర్శించారు. అవినీతితో వేల కోట్ల ఆస్తులు సంపాదించికున్నారు. 2014 ముందు మీ కుటుంబం ఆస్తులు ఎన్ని ఇప్పుడు ఎన్ని ఆస్తులు ఉన్నాయో ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. ఇంకెన్ని రోజులు తెలంగాణ సెంటిమెంట్ ను వాడుకుంటారని మండిపడ్డారు.

Next Story