తెలంగాణ గరిమను ప్రపంచానికి చాటిన గొప్ప కవి దాశరథి కృష్ణమాచార్య : కేసీఆర్

by Muthe.Rajitha |

తెలంగాణ గరిమను ప్రపంచానికి చాటిన గొప్ప కవి దాశరథి కృష్ణమాచార్య(Dasarathi Krishnamacharya) అని కొనియాడారు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR).

తెలంగాణ గరిమను ప్రపంచానికి చాటిన గొప్ప కవి దాశరథి కృష్ణమాచార్య : కేసీఆర్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ గరిమను ప్రపంచానికి చాటిన గొప్ప కవి దాశరథి కృష్ణమాచార్య(Dasarathi Krishnamacharya) అని కొనియాడారు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR). పీడితుల పక్షాన నిలిచిన కలం దాశరథి అని, జైలులో కూడా జై తెలంగాణ నినాదాన్ని వీడని యోధుడని, దాశరథి స్పూర్తిని కొనసాగించడమే వారికి మనమందించే నివాళి అని ఆయన శత జయంతి సందర్భంగా వారి కృషిని స్మరించుకున్నారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ' ... అంటూ తెలంగాణ గరిమను, తన సాహిత్యం ద్వారా ప్రపంచానికి చాటిన గొప్ప తెలంగాణ కవి, దాశరథి కృష్ణమాచార్య అని అన్నారు.

కవిగా, రచయితగా, తెలంగాణ అస్మితను, తన ప్రాంత ప్రజల కష్టాలను, ప్రపంచానికి వినిపించిన తెలంగాణ గర్వించదగ్గ భూమి పుత్రుడు దాశరథి అని కేసీఆర్ అన్నారు. అన్నార్తులు, పీడితులు, దుఃఖితుల కోసం తన కలాన్ని అందించిన దాశరథి కృష్ణమాచార్య కృషిని రేపటి తరాలు గుర్తు చేసుకునేలా, వారి పేరున అవార్డును నెలకొల్పి ప్రతీయేటా వారి జయంతి రోజున లబ్ద ప్రతిష్టులైన సాహిత్యకారులకు అందించాలని, నాటి బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించి అమలు చేసిందన్నారు.

Next Story