Revant vs KCR: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ట్విస్ట్.. రేవంత్ వర్సెస్ కేసీఆర్ మధ్య నువ్వా నేనా?

by Prasad Jukanti |

పార్టీ మారిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ విప్ దిక్కరిస్తారా?

Revant vs KCR: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ట్విస్ట్.. రేవంత్ వర్సెస్ కేసీఆర్ మధ్య నువ్వా నేనా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో మరో రాజకీయ రణరంగానికి నగారా మోగింది. ఎమ్మెల్యేల కోటాలో 5 ఎమ్మెల్సీ స్థానాల (MLA quota MLC Elections) భర్తీకి ఈసీ నోటిఫికేషన్ షెడ్యూల్ రిలీజ్ చేసింది. దీంతో అభ్యర్థుల ఎంపిక, గెలుపు వ్యూహాలపై ప్రధాన పార్టీలు ఫోకస్ పెట్టాయి. అయితే గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికకు దూరంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో మాత్రం అధికార పార్టీకి చెక్ పెట్టేలా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. శాసనసభలో ఆయా రాజకీయ పార్టీలకు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి ఎన్నికలు జరిగే ఈ 5 స్థానాల్లో 4 కాంగ్రెస్ కు (Congress), ఒకటి బీఆర్ఎస్ (BRS) కు దక్కనున్నాయి. 5 స్థానాలకు ఒక్కొక్క నామినేషన్ మాత్రమే దాఖలైతే ఏకగ్రీవం కావడం ఖాయం. కానీ ఇక్కడే కేసీఆర్ పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేయబోతున్నారనే చర్చ ఆసక్తిగా మారింది. తమ పార్టీ తరపున ఒకరికి బదులు ఇద్దరు అభ్యర్థులను బరిలోకి దింపనున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) మధ్య పొలిటికల్ ఫైట్ స్టేట్ పాలిటిక్స్ ను మరింత రంజుగా మార్చనున్నాయి.

10 మంది ఎమ్మెల్యేల ఓట్లు ఎటువైపు?:

ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేల అంశంపై తీవ్ర చర్చ జరుగుతున్నది. ఈ అంశంపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తుండటం, కోర్టు సైతం కీలక వ్యాఖ్యలు చేడయడంతో ఉప ఎన్నికలు వస్తాయని ప్రతిపక్షం, ఉప ఎన్నికలు ఎందుకు వస్తాయని అధికార పక్షం మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఈక్రమంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు రావడం సిట్యుయేషన్ ను మరింత హీట్ గా మార్చింది. ఈ ఎన్నికల్లో సీక్రెట్ ఓటింగ్ అయినప్పటికీ పార్టీలు తమ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ కూడా అదే వ్యూహంతో పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు విప్ ఇవ్వనుందని తెలుస్తోంది. అదే జరిగితే వారు పోలింగ్ కు హాజరై ఎవరికి ఓటు వేయబోతున్నారు అనేది ఉత్కంఠగా మారింది. ఒక్క ఎమ్మెల్సీ స్థానాన్ని గెలిపించుకునేందుకు 24 మంది ఎమ్మెల్యేలు అవసరం అవుతుంది. ఈ లెక్కన బీఆర్ఎస్ ఒక స్థానాన్ని కంఫర్టబుల్ గా నెగ్గే అవకాశం ఉంది. ఆ తర్వాత మరో 14 మంది ఎమ్మెల్యేలు మిగులుతారు. వీరికి అదనంగా మరో 10 మంది ఎమ్మెల్యేలు తోడైతే రెండో స్థానాన్ని బీఆర్ఎస్ దక్కించుకుంటుంది. బీఆర్ఎస్ కు పక్క పార్టీల నుంచి 10 మంది ఎమ్మెల్యేలు తోడవడం మాట అలా ఉంచితే పార్టీ మారిన 10 మందిలో ఎంత మంది కారు పార్టీవైపు నిలుస్తారనేది ఆసక్తిగా మారింది. అయితే తాము రెండో స్థానాన్ని గెలవకపోయినా విప్ జారి చేయడం ద్వారా తమ ఎమ్మెల్యేల ఓట్లు తమవైపే ఉంచుకోవడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తేవచ్చనేది కేసీఆర్ స్ట్రాటజీ గా తెలుస్తోంది.

రివర్స్ గిఫ్ట్ ఎవరికో?:

ఈ ఎన్నికలు రాజకీయంగా పార్టీపై ఉన్న విశ్వాసాన్ని ప్రదర్శించేందుకు కీలకంగా మారబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఏ మాత్రం తగ్గకుండా గట్టి పోటీ ఇచ్చేందుకు ఎవరికి వారు ప్రయత్నాలను పార్టీలు ముమ్మరం చేస్తున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత ఉందని, సొంత పార్టీ ఎమ్మెల్యేలే నమ్మకం కోల్పోతున్నారని బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తున్నది. అయితే ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలను హస్తం పార్టీ ఖండిస్తోంది. పట్టభద్రుల ఎన్నికల్లో కనీసం అభ్యర్థిని నిలపలేని బీఆర్ఎస్ ను తాము లెక్కలోకే తీసుకోవడం లేదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు రావడం ఇక్కడ కేసీఆర్ ఇద్దరు అభ్యర్థులను బరిలోకి దించుతారనే చర్చ నేపథ్యంలో ఎవరు ఎవరికి ఏ తరహా రివర్స్ గిఫ్ట్ (Reverse gift) లు ఇవ్వబోతున్నారనేది వేచి చూడాలి.

Next Story