- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేసీఆర్ కు దూరదృష్టి లేక అప్పులపాలు చేశారు : మహేష్ కుమార్ గౌడ్
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాష్ట్ర అభివృద్ధిపై దూరదృష్టి, విజన్ లేక ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా నాశనం చేశారని పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు

దిశ, యాదాద్రి కలెక్టరేట్ : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాష్ట్ర అభివృద్ధిపై దూరదృష్టి, విజన్ లేక ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా నాశనం చేశారని పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని హోటల్ వివేరాలో డిసిసి నూతన కార్యవర్గాన్ని ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ చేసిన అప్పుల వల్ల నేటికీ 6500 కోట్ల రూపాయలు వడ్డీలు చెల్లించాల్సి వస్తుందన్నారు. 10 ఏళ్లు పరిపాలించి 8 లక్షల కోట్ల రూపాయల అప్పుడు చేసి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి తోశారన్నారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేస్తే అవకాశాలు వాటి అంతట అవే వస్తాయన్నారు. భారతదేశ నిర్మాణంలో రాహుల్ గాంధీ కుటుంబం కీలక పాత్ర పోషించిందన్నారు. దేశ నిర్మాణంలో బిజెపి నాయకుల కుటుంబ సభ్యుల పాత్ర ఎక్కడ ఉందని ప్రశ్నించారు. కొద్దో గొప్పో సావర్కర్ గురించి చెప్పుకుంటే బ్రిటిష్ వారి కాళ్ళ వద్ద మోకరిల్లిన సంఘటనలు మాత్రమే ఉన్నాయన్నారు.
67 వేల ఉద్యోగ నియామకాలు
బిజెపి చెప్పుకునే నాయకులు లేక కాంగ్రెస్ పార్టీ నాయకులైన సర్దార్ వల్లభాయ్ పటేల్ ను సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో 40,000 ఉద్యోగాలకు మించి ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 67 వేల ఉద్యోగ నియామకాలు చేపట్టిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో పేద ప్రజలకు అధిక ప్రాధాన్యత కల్పించిందన్నారు. అర్హులైన పేద కుటుంబంలో కుటుంబ పెద్ద మరణిస్తే 5 లక్షల రూపాయల బీమా పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు. బిఆర్ఎస్ తెలంగాణలో ఇక మొలిచే అవకాశం లేదని రాష్ట్ర ప్రజలు కూకటివేళ్లతో సహా పెకిలించే శారన్నారు. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే, యాదాద్రి భువనగిరి జిల్లా డిసిసి బీర్ల ఐలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి, మున్సిపల్ చైర్ పర్సన్ లు తదితరులు పాల్గొన్నారు.






