- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నన్ను చంపుతామని బెదిరింపులు వచ్చినా కేసీఆర్ పట్టించుకోలేదు : గువ్వల బాలరాజు
తనను చంపుతామని బెదిరింపులు వచ్చినా కేసీఆర్(KCR) పట్టించుకోలేదని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు(Guvvala Bala Raju) ఆవేదన వ్యక్తం చేసారు.

దిశ, వెబ్ డెస్క్ : తనను చంపుతామని బెదిరింపులు వచ్చినా కేసీఆర్(KCR) పట్టించుకోలేదని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు(Guvvala Bala Raju) ఆవేదన వ్యక్తం చేసారు. కాగా నిన్న బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన గువ్వల బాలరాజు.. నేడు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం నుంచి పార్టీకి సేవలు చేస్తూ వచ్చానని, అలాంటి తనను ఎమ్మెల్యేల కొనుగోలు కేసు అనంతరం చంపుతామని బెదిరించారని, ఈ విషయాన్ని కేసీఆర్ కు చెప్పి రక్షణ పెంచాలని కోరితే పట్టించుకోలేదని అన్నారు. తనకు ఎమ్మెల్యే టికెట్ కాకుండా 2009, 2014, 2018లో బలవంతంగా ఎంపీ బీ ఫారం ఇవ్వాలని చూసారని ఆరోపించారు.
అచ్ఛంపేటలో భూ కబ్జాలపై, తనపై జరిగిన దాడులపై ఎవరూ నోరు విప్పలేదని అన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి మంత్రి పదవులు కట్టబెట్టారని, పార్టీకి ముందు నుంచి సేవలు అందిస్తున్న తనను పక్కన పెట్టాలని చూసారని తెలిపారు. ఉమామహేశ్వర ప్రాజెక్టు పూర్తి చేయాలని విన్నవించినా పట్టించుకున్న నాథుడే కరువయ్యాడని విమర్శించారు.






