KCR : ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో ముగిసిన కేసీఆర్, హరీష్ రావు భేటీ

by Muthe.Rajitha |

సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR), మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) నేడు నాలుగు గంటల పాటు సమావేశమయ్యారు.

KCR : ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో ముగిసిన కేసీఆర్, హరీష్ రావు భేటీ
X

దిశ, వెబ్ డెస్క్ : సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR), మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) నేడు నాలుగు గంటల పాటు సమావేశమయ్యారు. ఈ భేటీలో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విచారణ కమిషన్(Kaleswaram Commission) (జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో) జారీ చేసిన నోటీసులు, విజిలెన్స్ నివేదిక, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(NDSA) సూచనలపై కీలక చర్చ జరిగినట్టు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో సంభవించిన నిర్మాణ లోపాలు, పైల్స్ కుంగిపోవడం, లీకేజీలపై NDSA, విజిలెన్స్ నివేదికలు వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఈ నివేదికల్లో పేర్కొన్న లోపాలు, సాంకేతిక సమస్యల గురించి కేసీఆర్ సమగ్రంగా ఆరా తీశారని తెలుస్తోంది. కమిషన్ ముందు ఇప్పటికే హాజరైన కొంతమంది రిటైర్డ్ ఇంజనీర్లతో కేసీఆర్ ఫోన్‌లో మాట్లాడి, కమిషన్ అడిగిన ప్రశ్నలు, ఇంజనీర్లు ఇచ్చిన సమాధానాల గురించి వివరాలు తెలుసుకున్నారు. ఇంజనీర్లు తమ విచారణలో, ప్రాజెక్టు స్థల ఎంపిక, డిజైన్ మార్పులు, నిర్మాణ నిర్ణయాలు కేసీఆర్ సూచనల మేరకే జరిగాయని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్(MLC Kavitha Episode) గురించి కూడా చర్చ జరిగినట్టు తెలుస్తోంది.

కాగా కేసీఆర్ జూన్ 5న, హరీష్ రావు జూన్ 6న, మాజీ మంత్రి ఈటల రాజేందర్ జూన్ 9న జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్ ముందు హాజరు కావాలని నోటీసులు అందాయి. 2024 మార్చిలో ఏర్పాటైన ఈ కమిషన్, ఇప్పటివరకు 100 మందికి పైగా అధికారులను విచారించింది. కాగా విచారణ గడువు జులై 31, 2025 వరకు మరోసారి పొడిగించబడింది.

Next Story