Kaleswaram Commission : కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్, ఈటల రాజేందర్, హరీష్ రావు

by Muthe.Rajitha |

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleswaram Project) నిర్మాణంలో అవకతవకలు, అవినీతి ఆరోపణలపై జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh Commission) నేతృత్వంలోని కమిషన్ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే.

Kaleswaram Commission : కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్, ఈటల రాజేందర్, హరీష్ రావు
X

దిశ, వెబ్ డెస్క్ : కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleswaram Project) నిర్మాణంలో అవకతవకలు, అవినీతి ఆరోపణలపై జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh Commission) నేతృత్వంలోని కమిషన్ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో లోపాలు, డిజైన్, నాణ్యత నియంత్రణ, ఆర్థిక వ్యవహారాలపై కమిషన్ దృష్టి సారించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మితమైన ఈ ప్రాజెక్టు సమయంలో మాజీ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్(Eetala Rajendar), మాజీ నీటిపారుదల మంత్రి హరీష్ రావు(Harish Rao)లు కీలక పాత్రలు పోషించారు. వీరి ఇద్దరితో పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌(KCR)కు కూడా కమిషన్ నోటీసులు జారీ చేసింది.

ఈటల రాజేందర్ జూన్ 6న, హరీష్ రావు జూన్ 9న, కేసీఆర్ జూన్ 11న విచారణకు హాజరు కావాలని కమిషన్ ఆదేశించింది. కమిషన్ ఇప్పటికే 200 మంది అధికారులను, 25 మంది ఐఏఎస్ అధికారులను విచారించి... బ్యారేజీల నిర్మాణ సంస్థలు, ఇంజనీర్లు, కాగ్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికలను పరిశీలించింది. అధికారులు తమ వాంగ్మూలంలో కేసీఆర్ ఆదేశాల మేరకు నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. దీంతో వీరి ముగ్గురి వాదనలు కూడా పరిగణలోకి తీసుకోవడానికి కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ విచారణలో బీఆర్ఎస్ నేతల వాంగ్మూలాలు రాజకీయంగా కీలకం కానున్నాయి, జూన్ 30 నాటికి కమిషన్ తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Next Story