రంగంలోకి కేసీఆర్.. ఈ నెల 19 బీఆర్ఎస్ఎల్పీ సమావేశం

by Malleboina Mahesh |

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాలా తర్వాత రంగంలోకి దిగుతున్నారు.

రంగంలోకి కేసీఆర్.. ఈ నెల 19 బీఆర్ఎస్ఎల్పీ సమావేశం
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) చాలా తర్వాత రంగంలోకి దిగుతున్నారు. ఈ నెల 19న తెలంగాణ భవన్ (Telangana Bhavan)లో జరిగే బీఆర్ఎస్ఎల్పీ సమావేశం (BRSLP meeting)లో కేసీఆర్ పాల్గొననున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశం డిసెంబర్ 19న మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది. ఇందులో కృష్ణ, గోదావరి జలాలు, ప్రాజెక్టులపై కేసీఆర్ తమ పార్టీ నేతలతో చర్చించనున్నారు. అలాగే రైతుల నీటి హక్కులపై ఉద్యమానికి బీఆర్ఎస్ సిద్ధమైన నేపథ్యంలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ స్వయంగా సమావేశంలో పాల్గొనడం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా ఈ సమావేశానికి సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులోకి రావాల్సి ఉంది.

Next Story