తెలంగాణ భవన్కు చేరుకున్న కేసీఆర్

by Muthe.Rajitha |   (  Updated:2025-12-21 09:27:52  IST  )

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ బీభవం కు చేరుకున్నారు.

తెలంగాణ భవన్కు చేరుకున్న కేసీఆర్
X

దిశ,వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ బీభవం కు చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో మొదలు కానున్న BRSLP సమావేశానికి కేసీఆర్ అధ్యక్షత వహిస్తారు. ఈ క్రమంలో కేసీర్ కు పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు సహా కీలక నేతలంతా తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. BRSLP సమావేశంలో కృష్ణా, గోదావరి నదీ జలాల హక్కుల రక్షణ, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపులు తగ్గించిన అంశం, కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల పాలనపై సమీక్ష, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు, రాబోయే మున్సిపల్ ఎన్నికల వ్యూహాలు, పార్టీలో సంస్థాగత బలోపేతంపై చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే పలు జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించే అంశంపై కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశం తర్వాత కేసీఆర్ మీడియాతో మాట్లాడనున్నారు.

Next Story