కాజీపేట రైల్వే తయారీ యూనిట్ పై కేంద్రం కీలక ప్రకటన

by Prasad Jukanti |

కాజీపేట రైల్వే తయారీ యూనిట్ పై కేంద్రం కీలక ప్రకటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాజీపేట రైల్వే తయారీ యూనిట్ (Kazipet Rail Manufacturing Unit) విషయంలో కేంద్రం కీలక అప్ డేట్ ఇచ్చింది. ఈ తయారీ యూనిట్ పనులు చివరి దశకు చేరుకున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఇవాళ న్యూఢిల్లీలో కేంద్ర రైల్వే సహాయ మంత్రి రవనీత్ సింగ్ బిట్టు, సీనియర్ అధికారులతో కలిసి కాజీపేట రైలు తయారీ యూనిట్‌ను కార్యాచరణలోకి తీసుకువచ్చే ప్రణాళికలను సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కాజీపేట రైల్వే యూనిట్‌లో త్వరలోనే సరికొత్త ఇంటర్‌సిటీ రైళ్ల (Intercity Trains) తయారీ ప్రారంభం కానుందని స్పష్టం చేశారు. ఈ తయారీ యూనిట్ ద్వారా రాబోయే ఐదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా నడపడానికి 200 అత్యాధునిక ఇంటర్‌సిటీ రైళ్లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి ప్రకటించారు.

Next Story