- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Jaggareddy : కవిత లేఖతో బీఆర్ఎస్ కు నష్టం : జగ్గారెడ్డి
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(BRS MLC Kavitha) కేసీఆర్(KCR)కు రాసిన ఆరు పేజీల చేతితో రాసిన లేఖ(Letter to KCR) ఇంకా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది.

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(BRS MLC Kavitha) కేసీఆర్(KCR)కు రాసిన ఆరు పేజీల చేతితో రాసిన లేఖ(Letter to KCR) ఇంకా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. అయితే ఈ లేఖపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి(Jaggareddy) స్పందించారు. నేడు వరంగల్‌లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ. కవిత లేఖ వల్ల కాంగ్రెస్ కు వచ్చిన నష్టం ఏమీ లేదని స్పష్టం చేశారు. 2023 శాసనసభ ఎన్నికల్లో 64 సీట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు, సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో బలంగా ఉందని.. అలాంటి లేఖలు వంద పుట్టుకొచ్చినా తమకు జరిగే ఏమీ లేదని, ఈ గొడవ వల్ల గులాబీ పార్టీకే తీరని నష్టమని స్పష్టం చేశారు.
కవిత లేఖ బీఆర్ఎస్‌లో కేసీఆర్ కుటుంబ "పంచాయితీ"ని బయటపెట్టిందన్న జగ్గారెడ్డి.. కొడుకు కేటీఆర్ ఉండగా వారసత్వం కూతురుకు ఎలా దక్కుతుందని వ్యాఖ్యానించారు. ఈ లేఖ ద్వారా బీఆర్ఎస్ - బీజేపీతో రహస్య ఒప్పందాలు బయటపడ్డాయని ఆరోపించారు. ఈ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్‌కు అనుకూల వాతావరణాన్ని కల్పించిందని జగ్గారెడ్డి నొక్కిచెప్పారు.






