చేవెళ్ల బస్సు ప్రమాద బాధితులను పరామర్శించిన కవిత

by Ajay Maddhiboyina |

తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత చేవెళ్ల బ‌స్సు ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన బాధితుల‌ను ప‌రామ‌ర్శించారు. పీఎంఆర్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న బాధితుల వ‌ద్ద‌కు వెళ్లి వారితో మాట్లాడారు. వారికి అందుతున్న వైద్య సేవ‌ల గురించి అడిగి తెలుసుకున్నారు.

చేవెళ్ల బస్సు ప్రమాద బాధితులను పరామర్శించిన కవిత
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత చేవెళ్ల బ‌స్సు ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన బాధితుల‌ను ప‌రామ‌ర్శించారు. పీఎంఆర్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న బాధితుల వ‌ద్ద‌కు వెళ్లి వారితో మాట్లాడారు. వారికి అందుతున్న వైద్య సేవ‌ల గురించి అడిగి తెలుసుకున్నారు. బాధితుల‌కు మెరుగైన వైద్య సేవ‌లు అందించాల‌ని డాక్ట‌ర్ల‌కు సూచించారు. ఇదిలా ఉంటే చేవెళ్ల బ‌స్సు ప్ర‌మాదంలో 19మంది మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. ఆర్టీసీ బ‌స్సును టిప్ప‌ర్ లారీ ఢీ కొట్డడంతో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. రోడ్డుపై ఉన్న గుంత‌ను త‌ప్పించ‌బోగా ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్టు గుర్తించారు. గ‌త‌, ప్ర‌స్తుత ప్ర‌భుత్వాలు రోడ్డు విస్త‌రించ‌క‌పోవ‌డం వ‌ల్ల‌నే ప్ర‌మాదం జ‌రిగింద‌ని స్థానికులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Next Story