పునరాలోచన చేయాలని చెప్పా.. కవిత రాజీనామాపై గుత్తా సంచలన వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-09-18 05:32:31  IST  )

తెలంగాణ పాలిటిక్స్‌లో ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) రాజీనామా వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే.

పునరాలోచన చేయాలని చెప్పా.. కవిత రాజీనామాపై గుత్తా సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ పాలిటిక్స్‌లో ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) రాజీనామా వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఈనెల 3న ఆమె బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్సీ పదవికి సైతం రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఆ వెంటనే చైర్మన్ ఫార్మాట్‌లో తన రాజీనామా లేఖను కూడా ఆయన కార్యాలయానికి పంపారు. అనంతరం తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని స్వయంగా కల్వకుంట్ల కవిత శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutta Sukhender Reddy)కి ఫోన్ కూడా చేశారు. కానీ, 15 రోజులు గుడస్తున్నా.. ఇప్పటి వరకు ఆమె రాజీనామాపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పెండింగ్‌లో పెట్టడం అందరినీ ఉత్కంఠకు గురి చేస్తోంది.

ఈ నేపథ్యంలోనే అదే అంశంపై తాజాగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడతూ.. కవిత రాజీనామాపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. తన రాజీనామాను ఆమోదించాలని ఇటీవల కవిత ఫోన్ కూడా చేశారని తెలిపారు. కానీ, మళ్లీ తన రాజీనామా అంశం తన దృష్టికి రాలేదన్నారు. పార్టీ నుంచి బహిష్కరించిన నేపథ్యంలో ఎమోషనల్‌గా రాజీనామా చేశారు కాబట్టి.. పునరాలోచన చేసుకోవాలని చెప్పానని పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో విద్య, వైద్యం సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రధానంగా దృష్టి సారించారని అన్నారు. నిమ్స్ తరహాలో మెడికల్ కాలేజీలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా యూరియా వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఫీజు రియింబర్స్‌మెంట్ ఇబ్బందులు తగ్గాలంటే రాష్ట్రంలో ప్రభుత్వ కళాశాలలను బలోపేతం చేయాలని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.

Next Story