- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుర్తుపెట్టుకో మల్లన్న..ఎలా పడితే అలా మాట్లాడితే సహించం: ఎమ్మెల్సీ కవిత
తీన్మార్ మల్లన్న అలియాస్ ఎమ్మెల్సీ చింతపండు నవీన్ ఆఫీసుపై జాగృతి కార్యకర్తలు చేసిన దాడిపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. తీన్మార్ మల్లన్న

దిశ, వెబ్ డెస్క్: తీన్మార్ మల్లన్న అలియాస్ ఎమ్మెల్సీ చింతపండు నవీన్ ఆఫీసుపై జాగృతి కార్యకర్తలు చేసిన దాడిపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. తీన్మార్ మల్లన్న బీసీ ఉద్యమానికి సంబంధించి తనను ఎందుకు ప్రశ్నిస్తున్నారని అడిగారు. ఆర్డినెన్స్ తానేమైనా ఇచ్చేదాన్నే తెచ్చేదాన్నే అన్నారు. ఆయనలానే తానూ ఉద్యమం చేస్తున్నానని చెప్పారు. తీన్మార్ మల్లన్న మాట్లాడి 24 గంటలు అయినా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదన్నారు. అదే తమ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఒక పోస్టు పెడితే అరెస్ట్ చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో మహిళల పట్ల దారుణాలు పెరగటానికి ఇలాంటి నిర్లక్ష్యమే కారణం అన్నారు. ఇదేనా ఓ ఎమ్మెల్సీకి ఇచ్చే రక్షణ అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.
ఎమ్మెల్సీ పరిస్థితే ఇలా ఉంటే సాధారణ మహిళల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. తాను ఒక్క సెకన్ కూడా తీన్మార్ మల్లన్న గురించి మాట్లాడలేదని ఆయనకు ఏం అవసరం అని మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. తాను వెనక్కి తగ్గేది లేదని ఇంకా కొట్లాడుతూనే ఉంటానని చెప్పారు. ప్రజా సమస్యలు ఎవరైనా మాట్లాడవచ్చని, అందుకే జాగృతి బీసీ ఉద్యమం చేస్తోందన్నారు. చూస్తూ ఊరుకుంటే ఇలాంటివి పెరిగిపోతాయని మేధావులు ఆడబిడ్డవైపు నిలబడాలని అన్నారు. తెలంగాణలో ఆడబిడ్డలను ఎంతో పవిత్రంగా చూసే సంస్కృతి ఉంటుందని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో మహిళలను పరుష పదజాలంతో విమర్శిస్తే వచ్చేవాళ్లు కూడా రాకుండా ఉంటారన్నారు. తీన్మార్ మల్లన్న గుర్తు పెట్టుకోవాలని తెలంగాణ మహిళలు ఎలా పడితే అలా మాట్లాడితే ఊరుకోరని హెచ్చరించారు. బీసీ పేరు చెప్పుకుంటూ ఎలా పడితే అలా మాట్లాడితే సహించరని చెప్పారు.






