- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తీవ్ర దుమారం రేపుతోన్న కవిత మీటింగ్స్.. బుజ్జగింపుల తెల్లారే కమిటీలు
బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ కవిత లేఖ తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.

బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ కవిత లేఖ తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే ఉత్కంఠ నెలకొన్న వేళ ఇవాళ ఉదయం బంజారాహిల్స్‌లోని తన నివాసంలో సింగరేణి ఏరియా జాగృతి శ్రేణులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సింగరేణి జాగృతి కమిటీని ఏర్పాటు చేశారు. 1 ఏరియాలకు కో-ఆర్డినేటర్లను ఎమ్మెల్సీ కవిత నియమించారు. అయితే ఈ బుజ్జగింపుల పర్వం జరిగిన మరుసటి రోజే జాగృతి నేతలతో సమావేశం కావడం ఆసక్తిగా మారింది. రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఆమె ఈ భేటీలో తన అనుచరుల అభిప్రాయాలను తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. దీనిపై పూర్తి సమాచారం కోసం ఈ లింక్‌ను ఓపెన్ చేసి చూడండి.
రాజమండ్రిలో రూ.98 కోట్లతో చేపట్టనున్న ‘అఖండ గోదావరి’ టూరిజం ప్రాజెక్టుకు త్వరలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భూమి పూజ చేయనున్నారు. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఎస్ ఏఎస్ సీఐ స్కీమ్ కింద మంజూరైన ఈ పర్యాటక ప్రాజెక్టుకు జూన్ మొదటి వారంలో భూమిపూజ జరగనుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఈ లింక్ ఓపెన్ చేయండి.
మారుతున్న ప్రజావసరాలకు తగ్గట్టుగా పార్టీలో కీలక నిర్ణయాలు తీసుకోవాలని లోకేశ్సూచించారు. అన్న ఎన్టీఆర్ హయాంలో ఆత్మ గౌరవ నినాదం నియంతృత్వాన్ని తరిమేసిందన్నారు. చంద్రబాబు హయాంలో ఆత్మవిశ్వాసం అనే నినాదం తెలుగు ప్రజల భవిష్యత్తుకు పునాది పడిందని తెలిపారు. ఇప్పుడు ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రజలకు, పార్టీకి, కార్యకర్తలకు మంచి భవిష్యత్తును అందించే లక్ష్యంతో సరికొత్త ప్రణాళికలు రూపొందించాల్సిన సమయం వచ్చిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆరు సిద్ధాంతాలను లోకేశ్ప్రతిపాదించారు. అవేంట్ ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.
హైదరాబాద్ నగరంలో మావోయిస్టుల పేరుతో లేఖ కలకలం సృష్టించింది. కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ సోదరుడు కొడుకు రాఘవేందర్ గౌడ్‌ను చంపేస్తామని బెదిరిస్తూ గుర్తు తెలియని వ్యక్తులు లేఖ విడుదల చేశారు. రూ.50 లక్షలు ఇవ్వకపోతే చంపేస్తామని హెచ్చరించారు. ఈ లేఖపై అప్రమత్తమైన రాఘవేందర్ గౌడ్ జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.






