- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హరీష్ రావు తండ్రి మృతి... కవిత దూరం
బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ నేడు ఉదయం అనారోగ్య సమస్యలతో మరణించిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ నేడు ఉదయం అనారోగ్య సమస్యలతో మరణించిన సంగతి తెలిసిందే. గులాబీ అధినేత కేసీఆర్ కుటుంబం తోసహా ఆ పార్టీ ముఖ్య నేతలంతా హరీష్ రావు నివాసానికి చేరుకొని, ఆయన తండ్రికి నివాళులు అర్పించారు. అంతేకాదు సత్యనారాయణ కేసీఆర్ కు స్వయంగా బావ అవుతారు. కాగా తన మామ పార్థివదేహాన్ని చూడటానికి ఇంతవరకు కల్వకుంట్ల కవిత రాలేదు. అంత్యక్రియలకు హాజరవ్వడం కూడా అనుమానమే అంటున్నారు జాగృతి సభ్యులు.
ఇటీవల బీఆర్ఎస్ నాయకులపై ముఖ్యంగా హరీష్ రావుపై కవిత సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆమె వ్యాఖ్యలు రెండు కుటుంబాల మధ్య దూరాన్ని పెంచాయి. అయితే ఇలాంటి విషాద సంఘటనల్లో కేసీఆర్ కుటుంబం హరీష్ రావు వెంట ఉండగా.. కవిత కూడా వెళ్తే బాగుండు అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా.. కవిత కుమారుడు గౌతమ్ మాత్రం ఉదయం హరీష్ రావు ఇంటికి వెళ్లి తాతకు నివాళులు అర్పించారు.






