- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపు మీడియా ముందు వస్తా.. అందరి లెక్కలు తేలుస్తా: కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
బీఆర్ఎస్(BRS) నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Kaushik Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Kaushik Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. క్వారీ యజమానిని బెదిరించిన కేసులో కౌశిక్ రెడ్డికి బెయిల్ లభించిన విషయం తెలిసిందే. శనివారం కోర్టు ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రామాలు రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు. జైలుకు పంపాలని ఎన్ని కుట్రలు చేసినా నేను భయపడను. మంత్రుల ఇసుక దందాలు, భూ కబ్జాలు చేస్తున్నారు. రేపు మీడియా ముందుకు రాబోతున్నా. ఆధారాలతో సహా అందరి బాగోతాలు బయటపెడతా. రాష్ట్రంలో నేనే ఏకే-47 అవుతా’ అని పాడి కౌశిక్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.
ఇదిలా ఉంటే.. క్వారీ యజమానిని బెదిరించిన కేసులో కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం కాజీపేట రైల్వే కోర్టు(Kazipet Railway Court)లో హాజరుపర్చారు. 41ఏ నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేశారని కౌశిక్‌రెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరు వైపులా వాదనలు విన్న న్యాయమూర్తి.. కౌశిక్‌రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు.






