- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టిప్పర్ డ్రైవర్లపై యువకుల దాడి!
by Chukka Sudharani |
ఈ మధ్యకాలంలో కొందరు యువకులు మద్యం మత్తులో విచక్షణ రహితంగా వ్యవహరిస్తున్నారు.

X
దిశ, గోదావరిఖని: ఈ మధ్యకాలంలో కొందరు యువకులు మద్యం మత్తులో విచక్షణ రహితంగా వ్యవహరిస్తున్నారు. నడిరోడ్డుపై బహిరంగంగా మద్యం సేవిస్తూ దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఫైవింక్లెయిన్ చౌరస్తాలో జరిగింది. కొందరు యువకులు మద్యం మత్తులో వేకువజామున రోడ్డుపై వెళ్తున్న బొగ్గు లారీలను ఆపి డ్రైవర్లపై బీరు సీసాలతో దాడికి దిగారు. దీంతో డ్రైవర్లకు గాయాలయ్యాయి. స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. నిర్మానుష ప్రాంతం కావడంతో మందుబాబులకు అడ్డాగా మారిందనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇప్పటికైనా పోలీసులు దృష్టి సారించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Next Story






