- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా శక్తివంతులుగా ఎదగాలని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. మహిళా సాధికారత కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ఆయన తెలిపారు.

దిశ, గంగాధర : మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా శక్తివంతులుగా ఎదగాలని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. మహిళా సాధికారత కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ఆయన తెలిపారు. శనివారం గంగాధర మండల కేంద్రంలోని ప్రజా కార్యాలయంలో బూరుగుపల్లి గ్రామానికి చెందిన స్వశక్తి సంఘం మహిళలు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామంలో స్వశక్తి సంఘాల కార్యకలాపాలు మరింత విస్తరించేందుకు అదనపు స్వశక్తి సంఘం భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని మహిళలు ఎమ్మెల్యేను కోరారు. మహిళల అభ్యర్థనపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. గ్రామంలో మహిళల అభివృద్ధి కోసం అవసరమైన వసతులు కల్పించడంలో ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు.
స్వశక్తి సంఘాల ద్వారా మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించుకుని కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చని ఆయన అన్నారు. బూరుగుపల్లి గ్రామంలో అదనపు స్వశక్తి సంఘం భవన నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. దీంతో మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. తమ అభ్యర్థనను వెంటనే స్వీకరించి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు మహిళలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ, స్వశక్తి సంఘం భవనం నిర్మాణం జరిగితే గ్రామంలోని మహిళలు సమావేశాలు నిర్వహించుకోవడం, శిక్షణా కార్యక్రమాలు చేపట్టడం వంటి కార్యకలాపాలు సులభతరం అవుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్వశక్తి సంఘం మహిళలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.






