మద్యం మత్తులో దళిత మహిళపై అత్యాచారం...

by Bhanu |   (  Updated:2025-05-23 10:11:28  IST  )

కరీంనగర్ జిల్లాలో పట్టపగలు దారుణం చోటు చేసుకుంది ఓ దళిత మహిళ బస్సు దిగి ఇంటికి వెళుతున్న తరుణంలో అడ్డగించి అత్యాచారం చేసిన ఘటన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కలకలం రేపుతుంది.

మద్యం మత్తులో దళిత మహిళపై అత్యాచారం...
X

దిశ, బ్యూరో కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో పట్టపగలు దారుణం చోటు చేసుకుంది. ఓ దళిత మహిళ బస్సు దిగి ఇంటికి వెళ్తుండగా.. అడ్డగించి అత్యాచారం చేసిన ఘటన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కలకలం రేపుతుంది. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలానికి చెందిన ఓ మహిళ కొండాపూర్ లోని బంధువుల ఫంక్షన్ కు వెళ్లి తిరుగు ప్రయాణం అయింది. ఈ క్రమంలో కమాన్ పూర్ వద్ద బస్ దిగి తన గ్రామానికి నడుచుకుంటూ వెళ్తుండగా అప్పటికే అక్కడ మద్యం మత్తులో ఉన్న బద్దిపల్లి గ్రామానికి చెందిన సంజీవ్ (25) అక్కడే ఉన్నాడు. మహిళ ఒంటరిగా వెళ్తున్న విషయం గమనించి ఆమెను కొద్దిదూరం ఫాలో అయ్యాడు. అలా దారిమధ్యలో అడ్డగించి బలవంతంగా చెట్లపోదల్లోకి లాక్కువెళ్లి ఆమెపై దాడి చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత మహిళ గట్టిగా అరవడంతో వ్యవసాయ పొలంలో ఉన్న మహిళ గమనించి సంజీవ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేసింది. అయితే ఆమె తన భార్య అని.. నా ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటూ గ్రామస్తురాలిపై దాడి చేసే ప్రయత్నం చేశాడు.

ఇదంతా దూరంగా ఉన్న గ్రామస్తులు గమనించి అక్కడికి చేరుకునే లోపే దళిత మహిళపై దాడి చేసి అత్యాచారం చేశాడు. పూర్తిగా మద్యం మత్తులో ఉన్న సంజీవ్‌ను పట్టుకోని పోలీసులకు సమాచారం ఇచ్చారు. అలాగే అత్యాచారానికి గురై గాయపడిన మహిళను కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధిత మహిళ ఇటీవలనే ఓ ప్రమాదంలో గాయపడి అనారోగ్యంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఆరోగ్యం క్షీణించిన మహిళపై దాడి చేసి అత్యాచారం చేయడంతో ఆమె మరింత అస్వస్థతకు గురైనట్టు డాక్టర్లు చెబుతున్నారు. స్థానికులు సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితున్ని పోలీస్ స్టేషన్ కు తరలించినట్టు సమాచారం. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Next Story