వైద్యుల నిర్లక్ష్యమా? విధి నియమమా?..ఆపరేషన్ చేస్తున్న సమయంలో మహిళ మృతి

by Bhanu |   (  Updated:2025-06-12 14:18:50  IST  )

ఆపరేషన్ చేస్తుండగానే మహిళ చనిపోయిన ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలోని పల్లవి నర్సింగ్ హోమ్ లో చోటుచేసుకుంది.

వైద్యుల నిర్లక్ష్యమా? విధి నియమమా?..ఆపరేషన్ చేస్తున్న సమయంలో మహిళ మృతి
X

దిశ, జగిత్యాల రూరల్ : ఆపరేషన్ చేస్తుండగానే మహిళ చనిపోయిన ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలోని పల్లవి నర్సింగ్ హోమ్ లో చోటుచేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... సారంగాపూర్ మండలం పోచంపేట గ్రామానికి చెందిన అయిత రాజవ్వ(42) సంతానం లేకపోవడంతో ట్రీట్మెంట్ కొరకు పల్లవి నర్సింగ్ హోమ్ ఆస్పత్రికి వచ్చింది. గర్భసంచికి గడ్డ ఉందని తొలగించడానికి ఆపరేషన్ చేయాల్సిందిగా డాక్టర్ సూచించినట్లు బంధువులు తెలిపారు. ఈ క్రమంలో గురువారం ఆపరేషన్ చేస్తుండగానే అయిత రాజవ్వ చనిపోయింది. హైదరాబాద్ లో ఉన్న మరో డాక్టర్ ద్వారా వీడియో కాల్ లో మాట్లాడుతూ ఆమె సూచనల ప్రకారం ఆపరేషన్ చేయడంతోనే రాజవ్వ మృతి చెందిందని మృతురాలి బంధువులు ఆరోపిస్తూ ఆస్పత్రి ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

అయితే ఈ విషయమై డాక్టర్ ను వివరణ కోరగా వీడియో కాల్ ద్వారా ఆపరేషన్ చేయడం ఎక్కడా ఉండదని లాపరోస్కోపిక్ సర్జరీ కాబట్టి స్క్రీన్ పై చూస్తూ చేయడం ఉంటుందని అయితే పేషెంట్ బంధువులు అదే వీడియో కాల్ అని పొరబడి ఉంటారని స్పష్టం చేశారు. రాజవ్వకు మొదట మత్తు ఇచ్చామని అయితే ఆపరేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయకముందే గుండెపోటుతో మరణించందని డాక్టర్ల తప్పిదం ఏమీ లేదని తెలిపారు. మరోవైపు ఆస్పత్రి బయట నిరసన వ్యక్తం చేస్తున్న వారితో మాట్లాడిన పోలీసులు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.

Next Story