- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శిథిలావస్థలో క్వార్టర్స్.. ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరు?
కాకతీయ కాల్వ నిర్మాణంలో భాగంగా కేసీ క్యాంపులో ఇరిగేషన్ విభాగం గత 40 ఏళ్ల కింద ఏర్పాటు చేయడం జరిగింది.

కాకతీయ కాల్వ నిర్మాణంలో భాగంగా కేసీ క్యాంపులో నిర్మించిన క్వార్టర్స్ శిథిలావస్థకు చేరాయి. ఇరిగేషన్ విభాగం గత 40 ఏళ్ల కింద ఏర్పాటు చేయగా ఆ విభాగంలో విధులు నిర్వహించే ఉద్యోగుల నివాసం కోసం క్యాంపులో క్వార్టర్లు నిర్మించారు. క్వార్టర్స్ నిర్మించి 40ఏళ్లు పూర్తి కావడంతో పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో సంబంధిత విభాగం అధికారులు పూర్తిస్థాయిలో తొలగించాలని నిర్ణయించారు. అయితే ఇరిగేషన్ విభాగంతో ఎలాంటి సంబంధం లేని కొన్ని కుటుంబాలు ఇరిగేషన్ అధికారులను పలు విధాలుగా ఒప్పించి ఇక్కడే నివాసం ఉంటున్నారు. అసలు నివాసయోగ్యనికి పనికిరాని క్వార్టర్లలో భయం భయంగా నివాసం కొనసాగిస్తున్నారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు క్వార్టర్లలో పెచ్చులు ఊడుతూ, కురుస్తున్నాయి. ఇప్పటికే చాలావరకు క్వార్టర్లు పూర్తిస్థాయిలో కూలిపోయాయి. అయితే ఇందులో చాలావరకు క్వార్టర్లు ప్రమాదం అంచుల్లో ఉన్నప్పటికీ నివాసం ఉండడం పై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చినా ఖాళీ చేయడం లేదు. దీంతో ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దిశ, హుజూరాబాద్ రూరల్ : కాకతీయ కాల్వ నిర్మాణంలో భాగంగా కేసీ క్యాంపులో ఇరిగేషన్ విభాగం గత 40 ఏళ్ల కింద ఏర్పాటు చేయడం జరిగింది. ఇరిగేషన్ విభాగంలో విధులు నిర్వహించే ఉద్యోగుల నివాసం కోసం క్యాంపులో క్వార్టర్లు నిర్మాణం కూడా జరిగింది. కాలక్రమేణా ఇరిగేషన్ ఉద్యోగులు పదవీ విరమణతో పాటు కేసీ క్యాంపులోని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇక్కడి నుంచి తరలి వెళ్లడంతో ఇక్కడ ఉన్న క్వార్టర్లు ఖాళీ అయ్యాయి. దీంతోపాటు క్వార్టర్లు నిర్మాణం జరిగి 40 సంవత్సరాలు పూర్తి కావడంతో పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే సంబంధిత విభాగం నుంచి క్వార్టర్లు పూర్తిస్థాయిలో తొలగించాలని నిర్ణయం కూడా జరిగింది. అయితే ఇరిగేషన్ విభాగంతో ఎలాంటి సంబంధం లేని కొన్ని కుటుంబాలు ఇరిగేషన్ అధికారులను పలు విధాలుగా ఒప్పించి ఇక్కడే నివాసం ఉంటున్నారు.
క్వార్టర్లలో నివాసం ఉంటున్నందుకు ఇక్కడి ఇరిగేషన్ విభాగానికి కొంత డబ్బులు కూడా చెల్లించేవారు. అసలు నివాసయోగ్యనికి పనికిరాని క్వార్టర్లలో భయం భయంగా నివాసం కొనసాగిస్తున్నారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు క్వార్టర్లలో పెచ్చులు ఊడుతూ, కురుస్తున్నాయి. ఇప్పటికే చాలావరకు క్వార్టర్లు పూర్తిస్థాయిలో కూలిపోయాయి. అయితే ఇందులో చాలావరకు క్వార్టర్లు ప్రమాదం అంచుల్లో ఉన్నప్పటికీ నివాసం ఉంటున్నారు. అధికారులు ఎన్నిసార్లు ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చినప్పటికీ వాటిని ఖాళీ చేయకుండా అధికారులకు నివాస దారులు ప్రజాప్రతినిధులతో చెప్పించి మరి అక్కడే ఉంటున్నారు. చేసేదేమీ లేక ఇరిగేషన్ అధికారులు కూడా వదిలేశారు.
అధికారుల నోటీసులు..
ఇదిలా ఉండగా ఇటీవల క్వార్టర్లు ఖాళీ చేయాలని అధికారులు వారికి నోటీసులు పంపారు. దీంతో కేసీ క్యాంపులో చాలా కుటుంబాలు ఖాళీ చేసినప్పటికీ కొన్ని కుటుంబాలు మాత్రం నోటీసులను కూడా లెక్కచేయకుండా ఖాళీ చేసేది లేదని భీష్మించారు. అధికారులు అంతటితో ఆగకుండా వారికి వాటర్ సప్లై తోపాటు విద్యుత్ సరఫరా ను నిలిపేసినప్పటికీ ఖాళీ చేయడం లేదు. నివాసాదారులు కోర్టు ద్వారా అధికారులకు నోటీసులకు పంపారు. అసలు ఆ క్వార్టర్లలో ఏముందని అక్కడే ఉంటున్నారో అర్థం కావడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇరిగేషన్ విభాగంతో సంబంధం లేని బయటివారు గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నారు. ప్రస్తుతం వర్షాకాలం రాబోతున్న తరుణంలో వర్షానికి క్వార్టర్లు కూలిపోయి ప్రమాదం జరిగి ప్రాణ నష్టం జరిగితే ఎవరు బాధ్యులని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఇరిగేషన్ విభాగం అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వారిని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు పటిష్టంగా తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇరిగేషన్ అధికారులతో సాధ్యం కాకపోతే కలెక్టర్ దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపి కేసీ క్యాంపులో నివాసముంటున్న వారిని ఖాళీ చేయించాలని పలువురు కోరుతున్నారు. ఇప్పటికైనా క్యాంపులో నివాసం ఉంటున్న కుటుంబాల వారు మొండితనాన్ని వీడి క్యాంపు క్వార్టర్లను ఖాళీ చేయాలని కోరుతున్నారు.
తక్షణమే ఖాళీ చేయాలి..
ప్రసాద్, డీఈ, ఇరిగేషన్, హుజూరాబాద్
2018లోనే ఆర్ అండ్ బీ అధికారులు ఎస్సారెస్పీ క్వార్టర్లను కూల్చివేయాలని ఆదేశాలు ఇచ్చారు. అయినప్పటికీ కొందరు ఈ క్వార్టర్లలో నివాసం ఉంటున్నారు. గంగాధర్ అనే ఎంప్లాయ్ క్వార్టర్లను ఖాళీ చేయకుండా చూడాలని కోర్టుకు వెళ్లాడు. అయినప్పటికీ కోర్టు శిథిలావస్థకు చేరిన క్వాటర్లను కూల్చివేయాలని ఆదేశాలు ఇచ్చింది. గత ఏడు సంవత్సరాలుగా ఖాళీ చేయాలని చెబుతున్నా వాటిల్లోనే ఉంటున్నారు. ఖాళీ చేయడం లేదు. కొద్ది రోజుల్లోనే ఖాళీ చేయిస్తాం.






