పారిశుద్ధ్యం, నీటి సరఫరా, వీధి దీపాల సమస్యలను పరిష్కారిస్తాం

by Ratna Kumari |

నగరంలో పారిశుద్ధ్యం, నీటి సరఫరా, వీధి దీపాల సమస్యలను పరిష్కరించడానికి రూ.3.36 కోట్ల నిధులు అత్యవసరంగా మంజూరు చేయాలని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి కలెక్టర్ ని కోరారు.

పారిశుద్ధ్యం, నీటి సరఫరా,  వీధి దీపాల సమస్యలను పరిష్కారిస్తాం
X

దిశ, గోదావరిఖని : నగరంలో పారిశుద్ధ్యం, నీటి సరఫరా, వీధి దీపాల సమస్యలను పరిష్కరించడానికి రూ.3.36 కోట్ల నిధులు అత్యవసరంగా మంజూరు చేయాలని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి కలెక్టర్ ని కోరారు. పెద్దపల్లి లోని ఒక ఫంక్షన్ హాల్ లో బుధవారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పై జిల్లాలలోని మున్సిపాలిటీ ప్రజా ప్రతినిధులకు నిర్వహించిన ఓరియెంటేషన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న వేసవికాలంలో నీటి కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టడంలో భాగంగా బోర్ బావుల మరమ్మత్తులు , కొత్త బోర్ బావులు తవ్వడం , లీకేజీలు మరమ్మత్తులు,విలీన గ్రామాలతో పాటు సరఫరా లేని ప్రాంతాలకు పైప్ లైన్లు వేయడంలాంటి పనులకు ఒక కోటి రూపాయలు , వీధి దీపాల విడి భాగాల కోనుగోలు, కొత్త వీధి దీపాల, కూడళ్లలో మినీ హై మాస్ట్ లైట్లు ఏర్పాటుకు ఒక కోటి ముప్పది ఆరు లక్షల రూపాయలు , పారిశుద్ధ్య వాహనాల మరమ్మత్తులు , బ్లీచింగ్ , సున్నం తదితరాలకు మరో కోటి రూపాయల వరకు ఖర్చవుతాయని అంచనా వేశామని అన్నారు. నగర పాలక సంస్థ ఖజానా లో నిధుల కొరత దృష్ట్యా సీఎస్ ఆర్, డిఎంఎఫ్టి లేదా ఇతర అందుబాటులో ఉన్న నిధుల నుంచి అత్యవసరంగా రూ 3.36 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని కోరారు. ఈ మేరకు అంచనాలతో కూడిన ప్రతిపాదనలు సమర్పించారు. సమావేశానికి రామగుండం నుంచి శాసన సభ్యులు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ తో పాటు, డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య , కార్పొరేటర్లు, నగర పాలక సంస్థ అధికారులు హాజరయ్యారు.

Next Story