ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్ని నెరవేర్చుతాం..!

by Ratna Kumari |

మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చుతామని కాంగ్రెస్ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు అన్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్ని నెరవేర్చుతాం..!
X

దిశ, కోరుట్ల టౌన్ : మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చుతామని కాంగ్రెస్ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు అన్నారు. శనివారం జువ్వాడి భవన్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ప్రజా పాలనలో భాగంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి పట్టణ అభివృద్ధికి పెద్ద పీట వేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కృషి చేసిన నాయకులకు కార్యకర్తలకు సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ పార్లమెంట్ మున్సిపల్ ఎన్నికల ఇన్ చార్జి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీఫ్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి, గతంలో స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు చేసిన అభివృద్ధికే ఓటేషరన్నారు. బీఆర్ఎస్ నాయకులు మున్సిపాలిటీలా అభివృద్ధి పక్కన పెట్టి, కల్లబోల్లి మాటలు చెప్పి కాలం వెళ్ళదీశారనీ ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి కోరుట్ల, మెట్ ప‌ల్లి పట్టణల ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. ఈ సమావేశంలో ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎల్లాల వెంకటరెడ్డి ఉమ్మడి జిల్లా నాయకులు రాజోజీ, నాయకులు ఏలేటి మహిపాల్ రెడ్డి మాజీ కౌన్సిలర్ సంగ లింగం యాదవ్, నాయకులు భూస రాజేశ్వర్, మరిపెళ్లి జనార్ధన్, చేట్ పల్లి రంజిత్ గుప్త పాల్గొన్నారు.

Next Story