- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజల్లో చైతన్యం వచ్చే వరకు పోరాటం చేస్తూనే ఉంటా : మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
ప్రజల్లో చైతన్యం వచ్చే వరకు పోరాటం చేస్తూనే ఉంటానని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు.

దిశ, మంథని : ప్రజల్లో చైతన్యం వచ్చే వరకు పోరాటం చేస్తూనే ఉంటానని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. శనివారం మంథని పట్టణంలోని రాజగృహాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత అక్టోబర్ మాసంలో కుల సంఘాలకు భవనాలు మంజూరు చేశానంటూ పాలాభిషేకాలు చేయించుకున్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆ భవనాలకు జనవరి 12న శంకుస్థాపనలు చేశారని అన్నారు. మంథని పట్టణంలోని పోచమ్మ గుడి వద్ద మేర, పూసల, స్వర్ణకార, కుమ్మరి, నాయిబ్రాహ్మణ కుల సంఘాలకు ఒకే చోట భవన నిర్మాణాల కోసం శిలాఫలకాలు వేసి శంఖుస్థాపన చేశారని, ఆ ప్రాంతమంతా వాగు ఒడ్డున ఉందని,ముంపుకు గురయ్యే ప్రాంతంలో కులసంఘ భవనాలు నిర్మించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. బఫర్ జోన్, నాలా నద్దీ ప్రాంతాల్లో నిర్మించిన నిర్మాణాలను తొలగిస్తున్న క్రమంలో ఇక్కడ భవనాలు నిర్మిస్తామనడంలో అంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. వాగు ఒడ్డున ఉన్న కులసంఘా భవనాలన్నీ వాగులో కొట్టుకుపోవాలన్నదే ఆయన ఆలోచననా అని ప్రశ్నించారు. ఈ కులసంఘ భవనాలు గ్రామస్థాయిలోనా లేక మండల స్థాయిలోనా నియోజకవర్గ స్థాయిలోనా అనేది ఏదీ చెప్పడం లేదని స్పష్టత లేకుండా కుల సంఘాలకు శిలా ఫలకాలు వేసి ఆ సంఘాల్లో లొల్లి పెట్టించడమేనని ఆయన అన్నారు. పోచమ్మగుడి ప్రాంతంలో భవనాలు నిర్మించాలంటే ముందుగా వాగుకు సీసీవాల్స్ కట్టి రక్షణ ఉందని తేలిన తర్వాతనే చేయాల్సి ఉండగా ఆ దిశగా చేయలేదన్నారు. మనం ఎప్పటి వరకు చైతన్యవంతులం కామో అప్పటి వరకు ఓట్ల కోసం మోసం చేస్తూనే ఉంటాడని ఆయన స్పష్టం చేశారు.






