- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వేములవాడ ఏఎస్పీ ఆకస్మిక బదిలీ.. స్థానికంగా మొదలైన చర్చ!?
వేములవాడ సబ్ డివిజన్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే బదిలీ అయ్యారు.

దిశ, వేములవాడ: వేములవాడ సబ్ డివిజన్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో హైదరాబాద్‌లో ఏసీపీగా విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాసులును వేములవాడ డీఎస్పీగా నియమిస్తూ శనివారం రాత్రి డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉండగా ఏఎస్పీ రుత్విక్ సాయి ఆకస్మిక బదిలీ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. బాధ్యతలు చేపట్టిన కేవలం రెండు నెలల వ్యవధిలోనే ఆయనను బదిలీ చేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇది సాధారణ బదిలీ మాత్రమే అని పోలీసు వర్గాలు కొట్టి పారేస్తున్నప్పటికీ యువ ఐపీఎస్ బదిలీ వెనుక అసలు కారణాలు వేరే ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలతో పాటు అనేక సందర్భాల్లో పట్టణంలో జోరుగా జరుగుతున్న అక్రమ మద్యం దందాపై ఐపీఎస్ ఉక్కుపాదం మోపి, పెద్ద ఎత్తున మద్యం స్వాధీనం చేసుకోవడం, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గకుండా, చట్ట ప్రకారం ముందుకు వెళ్తూ విధులు నిర్వర్తించడంలో యువ ఐపీఎస్ సక్సెస్ అయ్యాడనీ, ఇది ఇలానే కొనసాగితే స్థానిక నాయకులు, అధికారుల నుంచి తమకు రాబోయే రోజుల్లో ఇబ్బందికర వాతావరణం ఎదురవుతుందని భావించిన స్థానిక కీలక నేత యువ ఐపీఎస్ బదిలీకి శ్రీకారం చుట్టినట్లు ఈ క్రమంలోనే సక్రమంగా విధులు నిర్వర్తిస్తున్న ఏఎస్పీపై బదిలీ వేటు వేయించినట్లు తెలుస్తుంది. వేటు పడిన యువ ఐపీఎస్ ఉట్నూర్ ఏ.ఎస్పీగా బదిలీపై వెళ్తున్నట్లు సమాచారం. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా సక్రమంగా విధులు నిర్వర్తించని అధికారిని బదిలీ చేయడంలో ఒక అర్థం ఉంటుంది కానీ అవినీతి, అక్రమాలను అరికట్టే సిన్సియర్ అధికారిని బదిలీ చేయడం ఏమిటని స్థానికంగా జోరుగా చర్చ జరుగుతోంది.






