- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొండగట్టు దర్శనానికి వెళ్తుండగా వాహన ప్రమాదం
by Ratna Kumari |
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామ శివారులో మంగళ వారం రోజు వేములవాడ నుంచి కొండగట్టు ఆలయ దర్శనానికి వెళ్తున్న భక్తుల వాహనం జేఎన్టీయూ కళాశాల సమీపంలో అదుపు తప్పి కాలువలో బోల్తా పడింది.

X
దిశ, కొడిమ్యాల : జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామ శివారులో మంగళ వారం రోజు వేములవాడ నుంచి కొండగట్టు ఆలయ దర్శనానికి వెళ్తున్న భక్తుల వాహనం జేఎన్టీయూ కళాశాల సమీపంలో అదుపు తప్పి కాలువలో బోల్తా పడింది. ఈ ఘటనలో వాహనంలో ప్రయాణిస్తున్న కొంత మంది భక్తులకు స్వల్ప గాయాలు అయ్యాయి. వాహనం బ్రేకులు విఫలమైన కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఘటన స్థలాన్ని పరిశీలించారు. గాయ పడిన వారిని వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలానికి సంబంధిన వారిగా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో మొత్తం పన్నెండు మంది ఉండగా.. గాయ పడిన వారిని జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నట్లు స్థానికులు తెలిపారు.
Next Story






