గుంతలమయంగా ఊటూర్-వేగురుపల్లి రోడ్డు

by Ajay Maddhiboyina |

కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని ఊటూర్, వేగురుపల్లి గ్రామాల మధ్య ఉన్న రహదారి మృత్యు కూపంగా మారింది. ముఖ్యంగా, నడిరోడ్డుపై ఏర్పడిన భారీ గొయ్యి కారణంగా నిత్యం ప్రమాదాలు పొంచి ఉన్నాయని, ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు బోల్తా పడే ప్రమాదం ఉంది. దీంతో భారీ గొయ్యిలో స్థానికులు కొన్ని చెట్ల కొమ్మలను ప్రమాద సూచిక బోర్డులాగా పెట్టారు.

గుంతలమయంగా ఊటూర్-వేగురుపల్లి రోడ్డు
X

కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని ఊటూర్, వేగురుపల్లి గ్రామాల మధ్య ఉన్న రహదారి ప్రమాదకరంగా మారింది. ముఖ్యంగా నడిరోడ్డుపై ఏర్పడిన భారీ గొయ్యి కారణంగా నిత్యం ప్రమాదాలు పొంచి ఉన్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు బోల్తా పడే ప్రమాదం ఉందని పలువురు వాపోతున్నారు. భారీ గొయ్యిలో స్థానికులు కొన్ని చెట్ల కొమ్మలను ప్రమాద సూచికలుగా పెట్టారు. ఈ దుస్థితిని చూసి స్థానికులు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు మండి పడుతున్నారు.

- దిశ, మానకొండూరు

దిశ, మానకొండూరు : కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని ఊటూర్, వేగురుపల్లి గ్రామాల మధ్య ఉన్న రహదారి మృత్యు కూపంగా మారింది. ముఖ్యంగా, నడిరోడ్డుపై ఏర్పడిన భారీ గొయ్యి కారణంగా నిత్యం ప్రమాదాలు పొంచి ఉన్నాయని, ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు బోల్తా పడే ప్రమాదం ఉంది. దీంతో భారీ గొయ్యిలో స్థానికులు కొన్ని చెట్ల కొమ్మలను ప్రమాద సూచిక బోర్డులాగా పెట్టారు. ఈ దుస్థితితో అధికారులపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు.

ఇసుక లారీల శాపం..

ఈ రోడ్డు దారుణంగా పాడవడానికి ప్రధాన కారణం గతంలో వేగురుపల్లి మానేరు వాగు నుంచి ఇసుక రీచ్ నిర్వాహకులు ఓవర్ లోడుతో ఇసుక లారీలను నిరంతరం వేగురుపల్లి ఇసుక రీచ్ నుంచి ఊటూర్ మీదుగా నడిపించడమేనని స్థానికులు చెబుతున్నారు. ఆనాటి రీచ్ నిర్వాహకులను ప్రజలు అడ్డుకోగా రోడ్డు బాగు చేయిస్తామంటూ హామీ ఇచ్చినా, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా ఈ సమస్యను పట్టించుకోలేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే దృష్టికి సమస్యను తీసుకెళ్లగా పచ్చునూరు-ఊటూర్ రోడ్డుకు కొంత ఉపశమనం లభించినా, ఊటూర్-వేగురుపల్లి రోడ్డు మాత్రం ఇంకా నరకంగానే మిగిలిందని వారు వాపోతున్నారు.

ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని...

ప్రస్తుతం ఈ రెండు గ్రామాల మధ్య రోడ్డు పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. రోడ్డు మధ్యలో ఏర్పడిన లోతైన గొయ్యి వాహనదారులకు అస్సలు కనిపించక, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా, నిత్యం ప్రయాణించే ప్రభుత్వ బస్సులు ఈ గుంతల్లో ఇరుక్కుపోయి, పక్కకు ఒరిగిపోతున్నాయి. దీంతో ప్రయాణికులు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రమాదం ఎప్పుడు జరుగుతుందోనన్న భయంతో స్థానికులు బిక్కుబిక్కుమంటున్నారు.

అధికారుల నిర్లక్ష్యం...

రోడ్డుపై ప్రమాదకరమైన గొయ్యి ఏర్పడినా అధికారులు ఇప్పటికీ పట్టించుకోకపోవడం స్థానికుల్లో ఆగ్రహం పెంచుతోంది. యుద్ధప్రాతిపదికన రోడ్డు మరమ్మతులు చేపట్టాలని, ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అధికారులు తక్షణమే కలుగజేసుకోవాలని ఊటూరు, వేగురుపల్లి గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. స్థానిక ప్రజలు, ప్రయాణికుల రక్షణ దృష్ట్యా, జిల్లా అధికారులు వెంటనే స్పందించి, యుద్ధప్రాతిపదికన ఊటూర్-వేగురుపల్లి గ్రామాల మధ్య ఉన్న ఈ రహదారికి మరమ్మతులు చేపట్టి, ప్రజలను రోడ్డు ప్రమాదాల నుంచి కాపాడాలని గట్టిగా కోరుతున్నారు. ఈ సమస్యపై స్థానిక ఎమ్మెల్యే గానీ, సంబంధిత రోడ్లు, భవనాలశాఖ అధికారులు గానీ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

Next Story