- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆన్ లైన్ బుకింగ్ తో కాకుండా నేరుగా యూరియా అందించాలి
గతంలో మాదిరిగా పంటలకు ఎరువుల దుకాణం లో నేరుగా యూరియా బస్తాలు అందించాలంటూ బుధవారం రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావు పేట మండల కేంద్రంలో గ్రోమోర్ దుకాణం వద్ద రైతులు నిరసన తెలిపారు.

దిశ, గంభీరావుపేట : గతంలో మాదిరిగా పంటలకు ఎరువుల దుకాణం లో నేరుగా యూరియా బస్తాలు అందించాలంటూ బుధవారం రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావు పేట మండల కేంద్రంలో గ్రోమోర్ దుకాణం వద్ద రైతులు నిరసన తెలిపారు. నేరుగా దుకాణం వద్దకు సమయం ఉన్నప్పుడు వచ్చి ఆటోలో యూరియా తీసుకుపోయే పరిస్థితులు ఎటు పోయాయాని అన్నదాతలు తీవ్ర ఆవేదన చెందారు. ఇచ్చే ఒకటి, రెండు బస్తాల కొరకు స్మార్ట్ ఫోన్ పట్టుకుని ఓటీపీ వచ్చినాక మండలంలో స్టాక్ వున్నా దుకాణంను ఎంచుకుని రెండు బస్తాలు బుక్ చేయాల్సిన కష్టాలను రైతులకు దూరం చేయాలన్నారు. బుక్ చేసుకున్న ID నెంబర్ ఆధారంంగా దుకాణమ్ కు పొతే అక్కడ సర్వర్ సమస్యలు, ఆన్లైన్ రాకపోతే పొద్ధాంతా అక్కడే ఉండాల్సిన రోజులు వచ్చాయాని రైతులు మొర పెట్టుకున్నారు. ప్రకృతిని నమ్ముకుని ఆరుగాలం కష్టం చేస్తున్న అన్నదాతలకు ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ పద్దతి తో యూరియా ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.






