హిందువుల ఐక్యతే దేశ భద్రతకు బలం

by Ratna Kumari |

హిందువుల ఐక్యతే దేశ భద్రతకు బలమని కరీంనగర్ వివాగ్ సహా వ్యవస్థ ప్రముఖ్ దవులూరి మురళీధర్ అన్నారు. ఆదివారం మండలంలోని గుండ్లపల్లి ఎక్స్ రోడ్ వద్ద ఓ ఫంక్షన్ హాల్ లో జంగపల్లి ఉప మండలం హిందూ సమ్మేళన సభ నిర్వహించారు.

హిందువుల ఐక్యతే దేశ భద్రతకు బలం
X

దిశ, గన్నేరువరం : హిందువుల ఐక్యతే దేశ భద్రతకు బలమని కరీంనగర్ వివాగ్ సహా వ్యవస్థ ప్రముఖ్ దవులూరి మురళీధర్ అన్నారు. ఆదివారం మండలంలోని గుండ్లపల్లి ఎక్స్ రోడ్ వద్ద ఓ ఫంక్షన్ హాల్ లో జంగపల్లి ఉప మండలం హిందూ సమ్మేళన సభ నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా గుండ్లపల్లి లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశ భద్రతకు హిందువుల ఐక్యత అవసరమని, ప్రతి హిందువు చైతన్యవంతు డై దేశ రక్షణకు, హిందూ ధర్మ రక్షణకు నడుము బిగించాలని పిలుపునిచ్చారు. హిందూ ఆడబిడ్డలు ల్యాండ్ జియాది, లవ్ జియాదిల చేతిలో మోసపోతున్నారని, వారి వలలు ఆడబిడ్డలు పడకుండా వారిని తల్లిదండ్రులు చైతన్యవంతులను చేయాలని సూచించారు.

అందరూ ఐకమత్యంతో హిందూ పండుగలను వైభవంగా జరుపుకొని, కట్టు బొట్టు హైందవ శ్రీ అలంకరణ గొప్పతనాన్ని భావితరాలకు తల్లులు తెలియపరచాలని, ప్రతి హిందువు గర్వంగా హిందూ ధర్మాన్ని ప్రచారం చేయాలని సూచించారు. హిందువులంతా ఐక్యమత్యంతో ఉంటే ఈ దేశాన్ని ఏ ఒక్కరు ఏమి చేయలేరని అన్నారు. హిందూ సమ్మేళన సభకు అధిక సంఖ్యలో మహిళలు స్థానిక ప్రజలు హాజరు కావడం ఆనందకరం అని కొనియాడారు. ప్రతి ఒక్కరూ శ్రీ రామ నామ పారాయణ, హనుమాన్ చాలీసా పారాయణ చేసి మానసిక ప్రశాంతతను పొందాలని, భావితరాలకు చక్కని క్రమశిక్షణ ను రామాయణ మహాభారత భాగవత గ్రంథాల నుండి గొప్ప వ్యక్తుల జీవిత గాధలతో తెలియపరచి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు సొల్లు అజయ్ వర్మ, సామ రాజిరెడ్డి, నాయకులు బేతల్లి రాజేందర్ రెడ్డి, లెంకల కిషన్ రెడ్డి, దొమ్మాట భాస్కర్ రెడ్డి, తాళ్ల పెళ్లి పరుశురాం గౌడ్, కొంకటి గణేష్, అటికం రామచంద్రం గౌడ్ అధిక సంఖ్యలో హిందూ బంధువులు మహిళలు పాల్గొన్నారు.

Next Story