- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కూతురు మానసిక పరిస్థితి చూడలేక తల్లి ఆత్మహత్య
by velandi.Saikiran |
పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం చోటుచేసుకుంది. మండలంలోని ఇప్పలపల్లి గ్రామానికి

X
దిశ, కాల్వశ్రీరాంపూర్ : పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం చోటుచేసుకుంది. మండలంలోని ఇప్పలపల్లి గ్రామానికి చెందిన జాగిలం లక్ష్మి, తన కూతురు రవళిని 18 నెలల క్రితం ఆశన్న పల్లె గ్రామానికి చెందిన రవికి ఇచ్చి వివాహం చేసింది. కుటుంబ కలహాలతో రవలి ప్రస్తుతం జాగిలం లక్ష్మి ఇంటి వద్దనే ఉంటుంది. తన కూతురు రవలి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో ఈ పరిస్థితి ఉందని జాలిగం లక్ష్మి తరచు బాధపడేది. ఈ తరుణంలోనే ఈ నెల 23న జాగిలం లక్ష్మి తన ఇంటిలో పురుగుల మందు తాగింది. దింతో వైద్యం కోసం కరీంనగర్ తరలించగా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో సోమవారం లక్ష్మీ మృత్యువాత పడింది. మృతురాలు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వేంకటేస్ తెలిపారు. మృతురాలికి భర్తతో పాటు ఒక కుమారుడు, మతిస్థిమితం లేని కూతురు ఉన్నారు.
Next Story






