సిరిసిల్లలో విషాదం.. ఇంతకీ ఏమైందంటే.. ?

by Naveena |

సిరిసిల్లలో విషాదం చోటుచేసుకుంది. 17వ బెటాలియన్ కమాండెంట్ తోట గంగారాం దుర్మరణం చెందారు.

సిరిసిల్లలో విషాదం.. ఇంతకీ ఏమైందంటే.. ?
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : సిరిసిల్లలో విషాదం చోటుచేసుకుంది. 17వ బెటాలియన్ కమాండెంట్ తోట గంగారాం దుర్మరణం చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల పట్టణం వెంకట్రావునగర్ లో గంగారాం ప్రమాదవశాత్తు లిఫ్ట్ లో పడి మృతి చెందాడు. సోమవారం రాత్రి సిరిసిల్ల డిఎస్పీని పరామర్శించి తిరిగి వస్తున్న క్రమంలో ఘటన జరిగింది. రాత్రి ఫైర్ సిబ్బంది మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ప్రధాన ఆస్పత్రికి తరలించారు. కాగా నిజామాబాద్ జిల్లాకు చెందిన గంగారం సిరిసిల్ల 17వ బెటాలియన్ కమాండెంట్ గా బాధ్యతలు చేపట్టి సుమారు మూడు నెలలు మాత్రమే అవుతుంది.

Next Story