ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పిస్తాన‌ని టోక‌రా

by Ratna Kumari |

రెవెన్యూ డిపార్ట్మెంట్ లో రికార్డ్ అసిస్టెంట్ ఔట్‌ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పిస్తానని ఓ నిరుద్యోగి వద్ద రూ.80వేలు తీసుకొని టోకరా వేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పిస్తాన‌ని టోక‌రా
X

దిశ, సైదాపూర్ : రెవెన్యూ డిపార్ట్మెంట్ లో రికార్డ్ అసిస్టెంట్ ఔట్‌ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పిస్తానని ఓ నిరుద్యోగి వద్ద రూ.80వేలు తీసుకొని టోకరా వేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని వెంకటేశ్వర్లపల్లి గ్రామానికి చెందిన మారెళ్ళ భూపతి అనే నిరుద్యోగ యువకుడి తండ్రికి గత ఏడాది కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలానికి చెందిన సిరిపురం సంపత్ అనే వ్యక్తి పరిచయమై వివిధ ప్రభుత్వ శాఖ ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పించానని యువకుని తండ్రికి నమ్మబలికి నీ కుమారునికి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి భూపతి అతని తండ్రి వద్ద రూ.80వేలు తీసుకున్నాడు. దాదాపు సంవత్సరం గడిచినా ఉద్యోగం ఇప్పించక ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగిన డబ్బులు ఇవ్వక నానా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని శనివారం నిరుద్యోగ యువకుడు మీడియా ముందు వాపోయాడు.

తన డబ్బులు తనకు ఇవ్వాలని లేదా ఉద్యోగం ఇప్పించాలని వేడుకున్న స్పందించడం లేదన్నారు. కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదని వాపోయాడు. సంపతి అనే వ్యక్తి చేతిలో మోసపోయానని గుర్తించుకున్న యువకుడు పలువురు స్నేహితులు, ప్రజాప్రతినిధుల ద్వారా డబ్బులు డబ్బుల విషయం అడిగించగా వాయిదాలు వేస్తూ నెలలు గడుస్తున్న డబ్బులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్న సిరిపురం సంపత్ పై చట్టపరమైన చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని నిరుద్యోగుడైన భూపతి అధికారులను విజ్ఞప్తి చేశాడు.

Next Story