- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరిగి వస్తానని ఏనాడు అనుకోలేదు : దేవ్ జీ
సుమారు నాలుగు దశాబ్దాల వనవాసం అనంతరం మాజీ మావోయిస్టు అగ్రనేత తిపిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ తన స్వగ్రామం కోరుట్లకు చేరుకోవడంతో స్థానికంగా ఉద్వేగభరిత వాతావరణాన్ని సృష్టించింది.

దిశ, జగిత్యాల ప్రతినిధి: సుమారు నాలుగు దశాబ్దాల వనవాసం అనంతరం మాజీ మావోయిస్టు అగ్రనేత తిపిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ తన స్వగ్రామం కోరుట్లకు చేరుకోవడంతో స్థానికంగా ఉద్వేగభరిత వాతావరణాన్ని సృష్టించింది. బుధవారం హైదరాబాద్‌కు వెళ్లిన ఆయన తమ్ముడు గంగాధర్‌తో పాటు కుటుంబ సభ్యులు దేవ్ జీని రిసీవ్ చేసుకుని కోరుట్లకు సాయంత్రం తీసుకువచ్చారు. సుమారు 42 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత స్వగ్రామంలో అడుగుపెట్టిన దేవ్ జీ రాకతో గ్రామంలో భావోద్వేగ వాతావరణం నెలకొంది. ఊరికి చేరుకున్న వెంటనే ఆయన తన పుట్టి పెరిగిన ఇంటికి వెళ్లి, స్వర్గస్తులైన తల్లిదండ్రుల ఫొటోలకు నివాళులు అర్పించారు. అనంతరం బంధుమిత్రులు, చిన్ననాటి స్నేహితులతో ఆప్యాయంగా కలుసుకుని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
మళ్లీ వస్తానని అనుకోలేదు..
దేవ్ జీ, తాను మళ్లీ పుట్టి పెరిగిన కోరుట్లకు వస్తానని కలలో కూడా అనుకోలేదని తెలిపారు. ఏది ఏమైనా బంధుమిత్రులను కుటుంబ సభ్యులను కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. మరో వైపు సామాజిక, ఆర్థిక అసమానతలు లేని సమాజం కోసం తాను అప్పట్లో ఎలా పోరాడానో, ఇప్పటికీ అదే లక్ష్యంతో ఉంటానని స్పష్టం చేశారు. తాను లొంగిపోయిన తర్వాతే అన్ని విషయాలు మీడియాతో మాట్లాడానని, ప్రస్తుతం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులను కలుసుకోవడానికే వచ్చినందున రాజకీయాలపై మాట్లాడటానికి సరైన సమయం కాదని పేర్కొన్నారు. భవిష్యత్తులో ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల సమస్యల కోసం పోరాటం కొనసాగిస్తానని, సరైన సమయంలో అన్ని విషయాలను మీడియా ద్వారానే వెల్లడిస్తానని దేవ్ జీ తెలిపారు.






