- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ ఆటో డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్ చేయాల్సిందే
తన ఆటోలో దొరికిన డబ్బును మళ్లీ ఆ యజమానికే అందేలా చేసి అందరితో శభాష్ అనిపించుకున్నాడు ఓ ఆటోడ్రైవర్. మనిషి నిజాయితీకి అద్దం పట్టే ఈ సంఘటన గంభీరావుపేట లో చోటుచేసుకుంది.

దిశ, గంభీరావుపేట : తన ఆటోలో దొరికిన డబ్బును మళ్లీ ఆ యజమానికే అందేలా చేసి అందరితో శభాష్ అనిపించుకున్నాడు ఓ ఆటోడ్రైవర్. మనిషి నిజాయితీకి అద్దం పట్టే ఈ సంఘటన గంభీరావుపేట లో చోటుచేసుకుంది. గంభీరావుపేట మండలానికి చెందిన ఆటో డ్రైవర్ అశోక్ ఆదివారం రోజున మాఘ అమావాస్య జాతర సందర్భంగా ప్రయాణికులను గంభీరావుపేట నుండి భీముని మల్లారెడ్డిపేటకు చేర్చే తరాణంలో తన వాహనాన్ని శుభ్రం చేస్తుండగా సుమారు రూ.5800 నగదు దొరికింది. రెడ్ పర్సు ఇంటి తాళం, అయితే అశోక్ ఆ డబ్బులు తనవని భావించకుండా సోమవారం రోజున తను తనతోపాటు ఆటో యూనియన్ సభ్యులను కూడా తీసుకువెళ్లి స్థానిక పోలీస్ స్టేషన్‌లో అందజేసి గొప్ప మనసు చాటుకున్నాడు. ఈ సందర్భంగా నిజాయితీ చాటుకున్న ఆటోడ్రైవర్ అశోక్ ను ఏఎస్ఐ శ్రీనివాస్ ఆటో డ్రైవర్ ను అభినందించారు. నిజాయితీకి ప్రతీకగా నిలిచిన అశోక్ లాగా ప్రతి ఒక్కరికీ ఆదర్శం అని ఎస్‌ఐ శ్రీనివాస్ ప్రశంసించారు. నిజాయితీగా తన గొప్ప మనసుతో డబ్బులు తిరిగి ఇవ్వడంతో స్థానికులు వాట్సాప్ గ్రూపుల్లో ప్రశంసలు కురిపిస్తున్నారు.






