హుజురాబాద్‌లో దొంగల చేతివాటం

by Ratna Kumari |

హుజూరాబాద్ పట్టణంలో దొంగలు చేతివాటం ప్రదర్శించారు. అందరూ ఓటు వేసే హడావుడిలో ఉండగా.. అదును చూసి వరుస దొంగతనాలకు పాల్పడ్డారు.

హుజురాబాద్‌లో దొంగల చేతివాటం
X

దిశ,​ హుజురాబాద్ రూరల్ : హుజూరాబాద్ పట్టణంలో దొంగలు చేతివాటం ప్రదర్శించారు. అందరూ ఓటు వేసే హడావుడిలో ఉండగా.. అదును చూసి వరుస దొంగతనాలకు పాల్పడ్డారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఒకే రోజు మూడు బైకులు మాయమవ్వడం స్థానికంగా కలకలం రేపుతోంది. పట్టణంలోని సాయిబాబా గుడి సమీపంలో నివసించే కొలిపాక చంద్రశేఖర్ తన బైకును ఇంటి ముందు పార్క్ చేసి ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. తిరిగి వచ్చి చూసేసరికి తన మోటార్ సైకిల్ కనిపించకపోవడంతో షాక్‌కు గురయ్యారు. కేవలం చంద్రశేఖర్‌దే కాకుండా పట్టణంలోని మరో రెండు ప్రాంతాల్లో కూడా బైకులు చోరీకి గురైనట్లు సమాచారం అందింది. ఓటర్లు తమ వాహనాలకు తాళాలు వేసి, ఓటు వేయడానికి వెళ్లిన సమయాన్ని దొంగలు ఆసరాగా చేసుకున్నట్లు తెలుస్తోంది. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హుజురాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Next Story