- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పేదల ఇళ్లు, పట్టాల పంపిణీపై వెనక్కి తగ్గేదే లేదు : ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధి, పేదల ఇళ్లు, రెవెన్యూ సమస్యలపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గళమెత్తారు.

దిశ, హుజురాబాద్ రూరల్ : హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధి, పేదల ఇళ్లు, రెవెన్యూ సమస్యలపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గళమెత్తారు. గురువారం హైదరాబాద్‌లోని హౌసింగ్ కార్పొరేషన్ హాల్‌లో నిర్వహించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజాప్రతినిధుల సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావుల సమక్షంలో నియోజకవర్గంలోని పెండింగ్ సమస్యలను ఏకరువు పెట్టారు. నిర్మాణం పూర్తయిన 2బి హెచ్ కె ఇళ్లను వెంటనే పంపిణి చేయాలన్నారు. జమ్మికుంట టౌన్, ధర్మారం, బూజునూర్, కమలాపూర్, గూడూరు, మర్రిపెళ్లిగూడెం, కోర్కల్, మల్లారెడ్డిపల్లి గ్రామాల్లో ఇప్పటికే వందశాతం పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే చిన్నకోమటిపల్లి, పోతిరెడ్డిపేట, విలాసాగర్ గ్రామాల్లో అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు.
జర్నలిస్టుల పట్టాలు, సైదాబాద్ భూ సమస్యలపై ధ్వజం..
హుజురాబాద్‌లో జర్నలిస్టులకు గతంలో కేటాయించిన పట్టా భూములను వెంటనే మంజూరు చేయాలని, వారికి ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని స్పష్టం చేశారు. జమ్మికుంట మండలం సైదాబాద్‌లో పేదలకు కేటాయించిన పట్టాలను తక్షణమే పంపిణీ చేయాలని కోరారు. వీణవంకలోని సమ్మక్క-సారలమ్మ జాతర భూములను దేవాదాయ శాఖకు అప్పగించాలని విన్నవించారు. హుజురాబాద్ పట్టణ ప్రజల ఆరోగ్య దృష్ట్యా ప్రతిపాదిత డంపింగ్ యార్డ్‌ను రద్దు చేయాలని కోరుతూ మంత్రులకు వినతి పత్రం సమర్పించారు.
మౌలిక సదుపాయాలు..
సొంత భవనాలు లేని ఇల్లంతకుంట మండలంలోని తహసీల్దార్ ఎంపీడీవో కార్యాలయాలతో పాటు పోలీస్ స్టేషన్ భవనాలను మంజూరు చేయాలని కోరారు. కాలువలు తెగిపోవడం వల్ల 8,000 ఎకరాలకు సాగునీరు అందడం లేదని, 70 కోట్ల అంచనాతో సిద్ధంగా ఉన్న డిపి ఆర్ ను ఆమోదించి పనులు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు.ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి విన్నపాలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఇందిరమ్మ ఇళ్లు మరియు 2 బి హెచ్ కె గృహాల కేటాయింపులో స్థానిక ఎమ్మెల్యేల సూచనలకే వంద శాతం ప్రాధాన్యత ఉంటుందని మంత్రి ఈ సందర్భంగా హామీఇచ్చారు.హుజురాబాద్ నియోజకవర్గంలో దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు.






