- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాముకు వైద్యం చేసిన వెటర్నరీ డాక్టర్ (వీడియో)
రాజన్న సిరిసిల్ల జిల్లాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. గాయపడిన పాముకు ఒక వెటర్నరీ డాక్టర్ చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు.

పాముకు వైద్యం చేసిన వెటర్నరీ డాక్టర్
ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్న పాము
సిరిసిల్లలో అరుదైన ఘటన
దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. గాయపడిన పాముకు ఒక వెటర్నరీ డాక్టర్ చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు. సాధారణంగా పాములను చూస్తే భయపడే ప్రజలు, డాక్టర్ చేసిన ఈ పనికి అవాక్కయ్యారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 12వ వార్డు చంద్రంపేటకు చెందిన ఓ కాటిపాముల వ్యక్తి ఇంట్లో 12 ఏళ్లుగా పెంచుకుంటున్న ఒక మన్నుగున్న (sand boa)పాముపై ప్రమాదవశాస్తు గడ్డపార పడటంతో దాని పొట్టలోంచి పేగులు బయటకు వచ్చాయి. దీంతో ఆ ఇంటి యజమాని సిరిసిల్లలోని పశువైద్యాధికారి అభిలాష్‌ను సంప్రదించగా, ఆయన ఆ పాముకు శస్త్రచికిత్స చేసి పేగులను సర్ది, ఆరు అంగుళాల పొడవు స్టిచెస్ వేశారు. మూడు రోజులపాటు అబ్జర్వేషన్‌లో ఉంచి చికిత్స అందించారు. ప్రస్తుతం పాము ఆరోగ్యంగా ఉన్నట్లు డాక్టర్ తెలిపారు.






