- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెద్ద చెరువు తూము షట్టర్ తీసిన గుర్తు తెలియని వ్యక్తులు
సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని పెద్ద చెరువు నీటి పారకం పై 300 వందల ఎకరాల పై చిలుకు సాగు భూమి, రైతులు వరి పంట పండించుకొని జీవనం కోనసాగిస్తున్నారు.

దిశ, సుల్తానాబాద్ : సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని పెద్ద చెరువు నీటి పారకం పై 300 వందల ఎకరాల పై చిలుకు సాగు భూమి, రైతులు వరి పంట పండించుకొని జీవనం కోనసాగిస్తున్నారు. అంతంత మాత్రమే చెరువులో నిలువ ఉన్న నీటిని గుర్తు తెలియని వ్యక్తులు తూము షట్టర్ తీసి నీటిని వృథాగా తూము ద్వారా బయటకు వదిలివేసారు. ఈసందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ... పొలం కోతలు ఈ మధ్యనే పూర్తి కావడం వల్ల పశువులు తినడానికి వరి కట్టలు గాని, పొలం పోషి దుక్కి దున్నుకోవడం, పశువుల పెంట వేసుకోవడానికి ట్రాక్టర్ వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు.
తూము షట్టర్ తీయడంతో పొలంలోకి నీరు చేరడం వల్ల అన్ని పనులకు ఆటంకం కలుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పశువులకు గడ్డి వేసవి కాలంలో పశువులకు నీటి సమస్య ఏర్పడుతుందన్నారు. గత వర్ష కాలం తక్కువ వర్ష పాతం నమోదు అయినందున, చెరువు నీరు పూర్తిగా తీసి వేయడం వలన వచ్చే కాలం పంటకు నీటి సమస్య ఏర్పడుతుందని రైతులు వాపోయారు. ఈ విషయం పై సంబంధిత ఇరిగేషన్ అధికారులకు సమాచారం అందించడంతో వారు వెంటనే స్పందించి తూము షట్టర్ మూసి వేసి మరమ్మతు చేసారని తెలిపారు.






