వానరాన్ని ఢీ కొట్టి.. ఆగకుండా వెళ్లిన ఆర్టీసీ బస్సు

by Ratna Kumari |

ఓ బస్సు డ్రైవర్ అతివేగం.. ఆపై అజాగ్రత్త.. వల్ల వానరం ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది.

వానరాన్ని ఢీ కొట్టి.. ఆగకుండా వెళ్లిన ఆర్టీసీ బస్సు
X

దిశ, తంగ‌ళ్ల‌ప‌ల్లి : ఓ బస్సు డ్రైవర్ అతివేగం.. ఆపై అజాగ్రత్త.. వల్ల వానరం ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం సిరిసిల్ల నుంచి హైదరాబాద్ వెళ్తున్న‌ ఆర్టీసీ బస్సు డ్రైవర్ జాగ్రత్తగా బస్సులు నడుపుతూ వేగంగా వెళ్లడంతో పాటు వానరానికి ఢీకొట్టాడు. తలకు గాయమైన వానరం అపస్మారక‌ స్థితికి చేరుకోవడంతో అక్కడున్న స్థానికులు రక్తం రాకుండా పసుపు పూసి ప్రథమ చికిత్స చేశారు. మూగ జీవం పట్ల బస్సు డ్రైవర్ వ్యవహరించిన తీరుపై స్థానికులు మండిపడ్డారు. వానరాన్ని ఢీకొట్టిన తర్వాత కనీసం వెనక్కి కూడా తిరిగి చూడకుండా అదే వేగంతో అక్కడి నుంచి జారుకోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజల ప్రాణాలకు రక్షణ ఏదీ..?

ప్రజలతో నిత్యం రద్దీగా ప్రాంతాల్లో సైతం ఆర్టీసీ బస్సు డ్రైవర్లు నిర్లక్ష్యంగా అతివేగంతో వెళ్తున్నారని, ప్రజల ప్రాణాలకు రక్షణ ఎవరని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి నిర్లక్ష్యపు చర్యల వల్ల ఇప్పుడు వానరానికి ప్రాణాల మీదకు వచ్చిందని, ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించకపోతే ప్రజల ప్రాణాలకు కూడా రక్షణ లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఆర్టీసీ జిల్లా అధికారులు స్పందించి రద్దీ ప్రాంతాల్లో డ్రైవర్లు వేగాన్ని నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Next Story