- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైకోర్టు తీర్పుతో పాత పీఏసీఎస్ పాలక వర్గాల పునరాగమనం.!
by Ratna Kumari |
తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా పాత పీఏసీఎస్ పాలక వర్గాలు తిరిగి బాధ్యతలు చేపడుతున్నాయి.

X
దిశ, మానకొండూరు : తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా పాత పీఏసీఎస్ పాలక వర్గాలు తిరిగి బాధ్యతలు చేపడుతున్నాయి. ప్రభుత్వం నియమించిన పీఐసీ కమిటీలను రద్దు చేస్తూ.. ఫిబ్రవరి 14, 2025 నాటికి ఉన్న ఎన్నికైన పాలక వర్గాలనే కొనసాగించాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు సహకార శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలో నాలుగు సహకార సంఘాల సొసైటీ కేంద్రాలు ఉండగా.. ఇప్పటికే మానకొండూరు, గట్టుదుద్దెనపల్లి, ఊటూర్ సొసైటీ చైర్మన్లు తిరిగి బాధ్యతలు స్వీకరించగా, దేవంపల్లి సొసైటీ చైర్మన్ కూడా త్వరలో పదవిలో చేరనున్నట్లు సమాచారం. పాత పాలక వర్గాల పునరుద్ధరణతో సహకార సంఘాల కార్యకలాపాలు గాడిలో పడతాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్న ద్వితీయ శ్రేణి నాయకులకు నిరాశ ఎదురైంది.
Next Story






