- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గోదావరిలో లభించిన శవం.. గొల్లపల్లి వాసిగా గుర్తింపు
కోటిలింగాలలోని గోదావరి పుష్కర ఘాట్ల వద్ద ఆదివారం ఉదయం లభించిన గుర్తు తెలియని మృత దేహం గొల్లపల్లి వాసిగా గుర్తించారు. కుటుంబ సభ్యుల మధ్య మనస్పార్థాలతోనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్టు గొల్లపల్లి ఎస్సై కృష్ణ సాగర్ రెడ్డి వెల్లడించారు.

దిశ, గొల్లపల్లి : కోటిలింగాలలోని గోదావరి పుష్కర ఘాట్ల వద్ద ఆదివారం ఉదయం లభించిన గుర్తు తెలియని మృత దేహం గొల్లపల్లి వాసిగా గుర్తించారు. కుటుంబ సభ్యుల మధ్య మనస్పార్థాలతోనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్టు గొల్లపల్లి ఎస్సై కృష్ణ సాగర్ రెడ్డి వెల్లడించారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చిల్వకోడూరు గ్రామానికి చెందిన కాంపల్లి బక్కవ్వకు రామ్, లక్ష్మణ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. చాలా కాలం క్రితం బక్కవ్వ భర్త అనారోగ్యంతో మరణించాడు. అయితే ఇద్దరు కుమారులను అన్ని తానై పోసిస్తుంది. ఇటీవల కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడిన మనస్పార్థాల కారణంగా బక్కవ్వ పెద్ద కొడుకు రాము (26) శుక్రవారం ఉదయం ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్లారు. బయటికి వెళ్లి రాత్రి అయిన తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు రాము కోసం ఎంత గాలించిన ప్రయోజనం లేకుండా పోయింది. అయితే ఆదివారం ఉదయం వెల్గటూర్ మండలంలోని కోటిలింగాల వద్ద గోదావరి నదిలో గుర్తు తెలియని మృత్తుదేహం లభించిందనే సమాచారంతో శవాన్ని పరిశీలించిన కుటుంబ సభ్యులు అది రాము దేనని గుర్తించారు. మృతుడి తమ్ముడు కాంపల్లి లక్ష్మణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గొల్లపల్లి స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.






