- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తీవ్రమవుతున్న డంపింగ్ యార్డ్ పై వ్యతిరేక ఉద్యమం
హుజురాబాద్ లో నిర్మాణం చేయతలపెట్టిన డంపింగ్ యార్డ్ పై చేస్తున్న ఉద్యమం రోజు, రోజుకు తీవ్రం అవుతోంది.

దిశ, హుజురాబాద్ : హుజురాబాద్ లో నిర్మాణం చేయతలపెట్టిన డంపింగ్ యార్డ్ పై చేస్తున్న ఉద్యమం రోజు, రోజుకు తీవ్రం అవుతుంది. హుజూరాబాద్ ప్రాంతం వాస్తవంగా పోరాటాలకు పురిటి గడ్డ అని, ఎన్నో పోరాటాలు ఇక్కడి నుంచే ఊపందుకున్న విషయం విదితమే అనే విషయాన్ని నిజం చేస్తూ ప్రజలు సంఘటితం అవుతున్నారు. గల్లి నుంచి ఢిల్లీ వరకు ఉద్యమం తీసుకెళ్తామని ఉద్యమ నాయకులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గత కొద్ధి రోజులుగా హుజూరాబాద్ లోని సిరసపల్లి శివారులో డంపింగ్ యార్డు నిర్మించి కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి వచ్చే చెత్త ను ఇక్కడికి తీసుకువచ్చి నిల్వ చేసి విద్యుత్ ఉత్పత్తికి ప్రతిపాదనలు చేశారు.
ఈ ప్రతిపాదన గతంలో వచ్చినా మధ్యలో ప్రజల నుండి వ్యతిరేకత రావడం తో ఆగిపోయింది. తిరిగి ఈ మధ్యనే డంపింగ్ యార్డు ను ఇక్కడ నిర్మాణం చేయడానికి ప్రతిపాదనలు చేయడమే కాకుండా ఇందుకు ముమ్మర యత్నాలు ప్రభుత్వం చేస్తుంది. వరంగల్ లోని మడికొండ లో నిర్మాణం చేయ తలపెడితే అక్కడి ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేయడమే కాకుండా ఉద్యమం చేయడం తో అక్కడి నుంచి బయటకు తరలించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తారు.కరీంనగర్ లో జిల్లాకు సంబంధించి డంపింగ్ యార్డు నిర్మాణం చేయ తలపెడితే అక్కడి ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉద్యమం చేశారు.అక్కడి ప్రజల వ్యతిరేకత ను పోగొట్టేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఇక్కడ డంపింగ్ యార్డు నిర్మాణాలు చేయడం లేదని, కరీంనగర్,వరంగల్ జిల్లాల సరిహద్దు మధ్యలో నిర్మాణం చేపడతామని స్పష్టంగా వారికి హామీ ఇచ్చాడు.దీంతో కరీంనగర్, వరంగల్ కార్పొరేషన్ ప్రజల వ్యతిరేకత ను పోగొట్టేందుకు అక్కడి నాయకులు, మంత్రులు హుజూరాబాద్ ను పావుగా వాడుకుని ఇక్కడ నిర్మాణం చేయ డానికి ప్రతిపాదనలు చేశారన్నది స్పష్టంగా తెలుస్తుందని, ప్రభుత్వం తమ ప్రతిపాదనలు విరమించుకునే వరకు పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఐక్య కార్యాచరణ సమితి నాయకులు స్పష్టం చేస్తున్నారు.
పార్టీల కతీతంగా ప్రజలు ముందుకు వచ్చి పోరాటం చేస్తే తప్ప ఈ ప్రతిపాదన వెనక్కి పోయే పరిస్థితి లేదని వారు పేర్కొంన్నారు. హుజురాబాద్ లో ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంటే మంత్రులు, ఎంపీ దీనిపై స్పష్టంగా స్పందించక పోవడం గమనార్హం. డంపింగ్ యార్డు నిర్మాణ వ్యతిరేక కమిటీ నాయకులు ఈ ప్రాంతం నుంచి వెళ్తున్న మంత్రి పొన్నం ను కలిసి సమస్య తీవ్రత ను చెపితే తూతూ మంత్రంగా ముఖ్యమంత్రితో చెప్పి చర్యలు తీసుకునే విధంగా చూస్తానని అన్నాడే తప్పా స్పష్టమైన హామీ ఇవ్వలేదు. ఇది 2022 నుంచి ఉన్న ప్రతిపాదన అని తమ ప్రభుత్వం హయాంలో చేసిన ప్రతిపాదన కాదని అనడం ఎంత వరకు సమంజసం అని వారు ప్రశ్నిస్తున్నారు. ఒక మంత్రి గా తన పరిధిలోని ప్రజల మనోభావాలను గౌరవించి స్పష్టమైన హామీ ఇవ్వాల్సిన మంత్రి హామీ ఇవ్వలేదు. ఎంపీ గా ఉన్న బండి సంజయ్ డంపింగ్ యార్డు కు వ్యతిరేకంగా తీసుకున్న చర్యలు లేవు సరికదా...ఇంతవరకు ఇక్కడికి వచ్చిన దాఖలాలు లేవు...ఇదంతా చూస్తే కరీంనగర్ ప్రజల ఓట్ల కోసం హుజురాబాద్ ను వీరు బలి చేయాలని చూస్తున్నారా..అనే సందేహం కలుగుతుంది. హుజురాబాద్ ప్రజలు సమస్య తీవ్రతను గమనించి ఉద్యమం మరింత ముందుకు తీసుకెళ్లి ప్రభుత్వం డంపింగ్ యార్డు నిర్మాణ ప్రతిపాదన విరమించుకునే వరకు పోరాటం చేయాల్సిన అవసరం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.నాయకులను ఎక్కడికక్కడ నిలదీస్తే తప్ప సమస్య పరిష్కారం కాదని భావిస్తున్నారు.






