- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, పెద్డపల్లి: పెద్దపల్లి జిల్లా హనుమంతునిపేట శివారులో శుక్రవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. బైకు, ట్రాలీ ఆటో ఢీకొని ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. వివరాల్లోకి వెళితే.. కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన గౌతం అశ్విత్, కోరే గణేష్ అనే ఇద్దరు యువకులు పెద్దపల్లి నుండి పెగడపల్లికి ద్విచక్ర వాహనంపై వెళ్తుతున్నారు. ఈ క్రమంలో కాల్వ శ్రీరాంపూర్ నుండి పెద్దపల్లి వైపు వస్తున్న ట్రాలీ ఆటో బైక్‌ను ఢీకొట్టింది. దీంతో పక్కనే ఉన్న చెట్టును బైకు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పెగడపల్లి గ్రామానికి చెందిన గణేష్(25), ట్రాలీ ఆటో డ్రైవర్ నరసయ్య(48) అక్కడికక్కడే మృతి చెందారు. అశ్విత్‌కు తీవ్ర గాయాలు కావడంతో పెద్దపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పెద్దపల్లి ఎస్ఐ రాజేష్ తన బృందంతో కలిసి హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.






