యూరియా కోసం రోడ్డెక్కిన కౌలు రైతు..

by Elthuri vijay kumar |

ఒక్క బస్తా కోసం రోజులుగా అధికారుల చుట్టూ ప్రదక్షిణలు విసిగివేసారిన కౌలు రైతు నిరసనగా రోడ్డుపై నిరసన, ట్రాఫిక్ జాం

యూరియా కోసం రోడ్డెక్కిన కౌలు రైతు..
X

యూరియా కోసం రోడ్డెక్కిన కౌలు రైతు..

ఒక్క బస్తా కోసం రోజులుగా అధికారుల చుట్టూ ప్రదక్షిణలు

విసిగివేసారిన కౌలు రైతు నిరసనగా రోడ్డుపై నిరసన, ట్రాఫిక్ జాం

రైతును పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు

దిశ, మెట్ పల్లి: యురియా కోసం కౌలు రైతు రోడ్డుపై నిరసన చేసిన ఘటన మెట్ పల్లి పట్టణంలో చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని పాత బస్టాండ్ చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై పట్టణానికి చెందిన రైతు సంపంగి సంపత్ రోడ్డుకు అడ్డంగా తన ద్విచక్ర వాహనం అడ్డుపెట్టి తనకు యూరియా బస్తా కావాలని నిరసన తెలుపుతూ ప్రభుత్వంపై వ్యతిరేకంగా నిరసన తెలిపారు. గత కొద్ది రోజుల నుండి యూరియా కోసం ఆఫీసర్ల చుట్టూ తిరిగినా ఒక బస్తా కూడా ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో రహదారిపై ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడ చేరుకొని ట్రాఫిక్ క్లియర్ చేసి కౌలు రైతు ను పోలీస్ స్టేషన్ తరలించారు.

Next Story