చలి పంజా.. దారుణంగా పడిపోతున్న ఉష్టోగ్రతలు

by Ajay Maddhiboyina |   (  Updated:2025-12-31 02:11:32  IST  )

జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. చలి కారణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డాక్టర్ లక్ష్మీప్రసాద్ కీలక సూచనలు చేశారు.

చలి పంజా.. దారుణంగా పడిపోతున్న   ఉష్టోగ్రతలు
X

దిశ, గోదావరిఖని : శీతాకాలం తన ప్రభావాన్ని రోజురోజుకు పెంచుతోంది. దారుణంగా ఉష్టోగ్రతలు పడిపోతుంది. తెల్లవారుజామున నుంచి రాత్రి వరకూ చలితో ప్రజలు వణికిపోతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు చలి తీవ్రతతో మంచాన పడుతున్నారు. జలుబు, దగ్గు, జ్వరం నుంచి గుండె, శ్వాసకోశ సమస్యల వరకూ చలి అనేక రోగాలకు కారణమవుతోంది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని, రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో చలి తీవ్రతతో ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారు. అక్కడ పరిశ్రమలు ఎక్కువ ఉండటంతో కాలుష్యం అధికంగా ఉంది. దీంతో గాలిలో కాలుష్య, చలి వలన రోగాలు వస్తున్నాయి. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే చిన్న సమస్యలు కూడా పెద్ద అనారోగ్యంగా మారే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.వయస్సు పెరిగేకొద్దీ శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దీంతో చలి ప్రభావం ముసలివారిపై ఎక్కువగా పడుతోంది. రక్తపోటు, గుండెపోటు ప్రమాదం ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు, జాయింట్ నొప్పులు వస్తున్నాయి. పాత రోగాలు తీవ్రతరం అవుతున్నాయి. ప్రజలు ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

చలి వల్ల వస్తున్న రోగాలు..

జలుబు, దగ్గు,జ్వరం న్యుమోనియా, ఆస్తమా సమస్యలు, కీళ్ల నొప్పులు రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు పిల్లల్లో శ్వాసకోశ ఇబ్బందులు వస్తున్నాయి. చలిలో బయటికి వెళ్లొద్దని వైద్యులు సూచిస్తున్నారు. మందపాటి దుస్తులు దరించాలంటున్నారు. వేడివేడిగా వండిన ఆహారాన్ని తినాలని వైద్యులు సూచిస్తున్నారు. తాజా పండ్లు, కూరగాయలను తినడం శరీరానికి చాలా మేలు అని డాక్టర్లు తెలిపారు. చల్లని పానీయాలు, ఐస్ పదార్థాలు తీసుకోవడం శరీరానికి మంచిది కాదని, జీవన శైలి తెల్లవారుజామున చలిలో బయటకు వెళ్లడం మానుకోవాలన్నారు. శరీరానికి చలి నేరుగా తాకకుండా చూసుకోవాలని చెప్పుతున్నారు. జలుబు, జ్వరం లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలని, సూచిస్తున్నారు.ముందస్తు జాగ్రత్తలే ఉత్తమ రక్షణ అని వైద్యులు సూచిస్తున్నారు.

చలికి జాగ్రత్తగా ఉండాలి

డాక్టర్ లక్ష్మీప్రసాద్ ఎండీ ఫిజీషియన్

చలి తీవ్రత అధికంగా ఉంది. ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటూ చలి నుంచి కాపాడుకోవాలి. వ్యక్తిగత రక్షణ తీసుకుంటూ, రాత్రి సమయంలో తప్పకుండా షర్టర్లు ధరించాలి. ఏమాత్రం అనారోగ్యమనిపించిన డాక్టర్ ను సంప్రదించి సూచనలు తీసుకోవాలి.ఏమాత్రం అజాగ్రత్త చేసిన ప్రాణాలు పోయే అవకాశాలు ఉన్నాయి.

Next Story