తెలంగాణ సాఫ్ట్ బేస్‌బాల్ సెలక్షన్ ట్రయల్స్

by Ratna Kumari |

దిశ, సుల్తానాబాద్ : సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి ప్రభుత్వ పాఠశాలలో 4వ తెలంగాణ సాఫ్ట్ బేస్‌బాల్ అసోసియేషన్ సెలక్షన్ ట్రయల్స్ విజయవంతంగా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 23 జిల్లాల నుంచి

తెలంగాణ సాఫ్ట్ బేస్‌బాల్ సెలక్షన్ ట్రయల్స్
X

దిశ, సుల్తానాబాద్ : సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి ప్రభుత్వ పాఠశాలలో 4వ తెలంగాణ సాఫ్ట్ బేస్‌బాల్ అసోసియేషన్ సెలక్షన్ ట్రయల్స్ విజయవంతంగా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 23 జిల్లాల నుంచి వచ్చిన బాలురు, బాలికలు కలిపి మొత్తం 100 మంది క్రీడాకారులు జూనియర్ యూత్ విభాగాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా అసోసియేషన్ జిల్లా కార్యదర్శి సతీష్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో ప్రతిభావంతులను గుర్తించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేయడం లక్ష్యమని తెలిపారు. పెద్దపల్లి జిల్లా పేట సెక్రటరీ దాసరి రమేష్, అసోసియేషన్ స్టేట్ సెక్రటరీ గురువేందర్, గౌతమ్, ఇక్బాల్, ఎస్ జి ఎఫ్ సెక్రటరీ ప్రణయ్, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి భాస్కర్, ఆసిఫాబాద్ కార్యదర్శి అలేఖ్య, వాలీబాల్ సీనియర్ క్రీడాకారులు సత్యం, వెంకటేష్, కృష్ణ, అంజలి హాజ‌ర‌య్యారు.

Next Story