ప్రైవేట్ హాస్పిటల్స్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు

by velandi.Saikiran |

ప్రైవేట్ హాస్పిటల్స్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు అడిషనల్ కలెక్టర్ ( స్థానిక

ప్రైవేట్ హాస్పిటల్స్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
X

దిశ, జగిత్యాల కలెక్టరేట్ : ప్రైవేట్ హాస్పిటల్స్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు అడిషనల్ కలెక్టర్ ( స్థానిక సంస్థలు) బి రాజా గౌడ్. మంగళవారం బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ కమిటీ జిల్లా స్థాయి సమావేశం అడిషనల్ కలెక్టర్ బి రాజా గౌడ్ ఆధ్వర్యంలో ఆయన ఛాంబర్ లో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ హాస్పిటల్స్ కచ్చితంగా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంటు యాక్ట్ ప్రకారం నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు. వీటిని యాజమాన్యాలు అతిక్రమించినట్లయితే కఠిన చర్యలు తీసుకోబడతాయని వార్నింగ్ ఇచ్చారు.

ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ పై తగిన శ్రద్ధ వహించాలని తెలిపారు. మున్సిపల్ కు సంబంధించిన వాహనాలలో బయో మెడికల్ చెత్తను పారవేయకూడదని అలా జరిగినచో వారిపై తగిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణమూర్తి ,ఆర్ఎంఓ డాక్టర్ సుమన్,ఐఎంఏ కోశాధికారి డాక్టర్ కోటగిరి సుధీర్, మున్సిపల్ కమిషనర్లు హెచ్ ఎం స్మందన, మోహన్, మనోహర్, రవీందర్ , పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులు, వెంకటరమణ ఇన్సురనేషన్ సిబ్బంది, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ పర్యవేక్షకులు కుతుబుద్దీన్, హెల్త్ ఎడ్యుకేటర్ లు కటుకం భూమేశ్వర్,తరాల శంకర్ హెచ్ ఈ ఓ రాజేశం తదితరులు పాల్గొన్నారు.

Next Story