- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వృద్ధురాలిపై కుక్కల దాడి
by S Gopi |
పెద్దపెల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని విఠల్ నగర్ లో ఆదివారం ఉదయం కుక్కలు స్వైర విహారం... Stray dogs attack on old man

X
దిశ, గోదావరిఖని: పెద్దపెల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని విఠల్ నగర్ లో ఆదివారం ఉదయం కుక్కలు స్వైర విహారం చేశాయి. ఈ దాడిలో ఓ వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. వివరాల్లోకి వెళ్తే.. రత్నమ్మ (70) అనే వృద్ధురాలు తన ఇంటి ముందు ఉండగా వీధి కుక్కలు ఆమెపై దాడి చేశాయి. వృద్ధురాలి అరుపులు విన్న స్థానికులు ఇంటి బయటకు వచ్చారు. వీధి కుక్కలు చుట్టుముట్టి, గాయపరుస్తున్న దృశ్యాలను చూసి స్థానికులు తల్లడిల్లిపోయారు. కుక్కల దాడి నుంచి వృద్ధురాలిని కాపాడి, తీవ్ర గాయాలపాలైన ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం కరీంనగర్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించారు. రత్నమ్మకు కుట్లు పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రత్నమ్మ కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు.
Next Story






